జగన్‌పై ఎన్‌టీవీ సొంత ఆరోప‌ణ‌లు

వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు మొదలయ్యాయని మూడు రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ కథనాలను ప్రసారం చేయడంలో టీడీపీ సొంత మీడియా సంస్థలతో పాటు కొత్తగా ఆ జాబితాలోకి ఎన్ టీవీ కూడా చేరిన‌ట్టుగా క‌నిపిస్తోంది. మూడు రోజుల నుంచి గంట‌కొక‌సారి పలాన జిల్లా నుంచి పలానా ఎమ్మెల్యే వైసీపీని వీడుతున్నారంటూ క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్న‌ ఎన్ టీవీ …  సోమ‌వారం సాయంత్రం మరింత రెచ్చిపోయింది. జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌పై తీవ్ర వ్యాఖ్య‌ల‌తో క‌థ‌నాలు ప్ర‌సారం చేసింది. […]

Advertisement
Update: 2016-02-22 11:55 GMT

వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు మొదలయ్యాయని మూడు రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ కథనాలను ప్రసారం చేయడంలో టీడీపీ సొంత మీడియా సంస్థలతో పాటు కొత్తగా ఆ జాబితాలోకి ఎన్ టీవీ కూడా చేరిన‌ట్టుగా క‌నిపిస్తోంది. మూడు రోజుల నుంచి గంట‌కొక‌సారి పలాన జిల్లా నుంచి పలానా ఎమ్మెల్యే వైసీపీని వీడుతున్నారంటూ క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్న‌ ఎన్ టీవీ … సోమ‌వారం సాయంత్రం మరింత రెచ్చిపోయింది.

జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌పై తీవ్ర వ్యాఖ్య‌ల‌తో క‌థ‌నాలు ప్ర‌సారం చేసింది. పార్టీని జ‌గ‌న్ గాలికి వ‌దిలేశార‌ని… సొంత‌ప‌నులు చ‌క్క‌బెట్టుకునేందుకు ఢిల్లీ వెళ్లార‌ని, కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఢిల్లీలో రెండు రోజుల పాటు మ‌కాం వేస్తున్నార‌ని ఒక తీవ్ర ఆరోప‌ణ కూడా చేసింది ఎన్ టీవీ. ఇక్క‌డ పార్టీ అత‌లాకుత‌లం అవుతుంటే జ‌గ‌న్ మాత్రం ఢిల్లీకి వెళ్ల‌డం స‌ద‌రు చాన‌ల్‌కు విస్మ‌యం క‌లిగిస్తోంద‌ట‌. వెళ్లిపోతున్న ఎమ్మెల్యేల‌ను ఆపే నాథుడే లేర‌ని టీడీపీ అనుకూల మీడియా క‌న్నా దూకుడుగా ముందుకెళ్తోంది ఎన్ టీవీ.

ఏపీలో వైసీపీ అత‌లాకుత‌లం అవుతున్నట్టుగా ఎన్ టీవీకి అనిపిస్తోంద‌ట‌. గతంలో ఇలా జ‌గన్‌పై విప‌రీత ధోర‌ణితో టీడీపీ అనుకూల మీడియా సంస్థ‌లు మాత్ర‌మే క‌థ‌నాలు ప్ర‌సారం చేసేవి. ఇప్పుడు ఎన్ టీవీ వాటి కంటే దూకుడుగా ముందుకెళ్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బ‌హుశా … చంద్రబాబు ఇంతగా కష్టపడి ఎమ్మెల్యేలను ఆకర్శిస్తుంటే జగన్ మాత్రం కూల్ గా ఢిల్లీలో ఉండడం ఆ చానల్ కు నచ్చినట్టుగా లేదు. ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుంటే జ‌గ‌న్ కంగారు ప‌డలేదే !… అత్య‌వ‌స‌ర‌మీటింగ్‌లు పెట్టి వ‌ణికిపోలేదే అన్న బాధ ఎన్ టీవీలో ఉన్న‌ట్టుగా ఆ చాన‌ల్ ధోర‌ణిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

కర్నూలు జిల్లా నుంచి ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారని… జగన్ ఎమ్మెల్యేల సమావేశంలో భూమాను తిట్టారని కూడా తొలుత స్క్రోలింగ్ నడిపింది కూడా ఎన్ టీవీనే. అలా స్క్రోలింగ్ నడపంపై కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఆరోజే. ఎన్ టీవీ తీరు చూస్తుంటే జగన్ కు వైరి మీడియాలో మరో చానల్ పూర్తి స్థాయిలో చేరినట్టుగా అనిపిస్తోంది. ఫిరాయింపు రాజకీయాల్లో రాజకీయ పార్టీల కన్నా టీవీ చానళ్ల దూకుడే ఎక్కువగా కనిపిస్తోంది.

Click on image to read:

 

 

Tags:    
Advertisement

Similar News