బెజ‌వాడ‌వాసులు పెద్ద‌మ‌నసు చేసుకోండి!

అమ‌రావ‌తి తుళ్లూరు మండ‌లం వెల‌గ‌పూడి ప‌రిధిలో తాత్కాలిక స‌చివాల‌య నిర్మాణానికి సీఎం చంద్ర‌బాబు శంకుస్థాప‌న చేశారు. కార్య‌క్ర‌మాన్ని ఘనంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించిన చంద్ర‌బాబు … రాష్ట్రాన్ని అనైతికంగా విభ‌జించిన వారు అసూయ‌ప‌డేలా రాజ‌ధాని నిర్మిస్తామ‌న్నారు. ప్ర‌స్తుతం నిర్మించ‌బోయేది తాత్కాలిక భ‌వ‌నాలు కాద‌ని.. శాశ్వ‌త‌మైన‌వేన‌ని చెప్పారు. విజ‌య‌వాడ ప్రాంతంలో ఇంటి అద్దెలు ఎక్కువ‌గా ఉంటున్నాయ‌ని ఈ విష‌యంలో ఇళ్ల య‌జ‌మానులు పెద్ద‌మ‌న‌సుతో ఆలోచించాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. రాజ‌ధాని నిర్మాణానికి ఒక్క పిలుపుతో స్వ‌చ్చందంగా 33 […]

Advertisement
Update: 2016-02-17 02:53 GMT

అమ‌రావ‌తి తుళ్లూరు మండ‌లం వెల‌గ‌పూడి ప‌రిధిలో తాత్కాలిక స‌చివాల‌య నిర్మాణానికి సీఎం చంద్ర‌బాబు శంకుస్థాప‌న చేశారు. కార్య‌క్ర‌మాన్ని ఘనంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించిన చంద్ర‌బాబు … రాష్ట్రాన్ని అనైతికంగా విభ‌జించిన వారు అసూయ‌ప‌డేలా రాజ‌ధాని నిర్మిస్తామ‌న్నారు. ప్ర‌స్తుతం నిర్మించ‌బోయేది తాత్కాలిక భ‌వ‌నాలు కాద‌ని.. శాశ్వ‌త‌మైన‌వేన‌ని చెప్పారు. విజ‌య‌వాడ ప్రాంతంలో ఇంటి అద్దెలు ఎక్కువ‌గా ఉంటున్నాయ‌ని ఈ విష‌యంలో ఇళ్ల య‌జ‌మానులు పెద్ద‌మ‌న‌సుతో ఆలోచించాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

రాజ‌ధాని నిర్మాణానికి ఒక్క పిలుపుతో స్వ‌చ్చందంగా 33 వేల ఎక‌రాలు భూమి ఇచ్చిన రైతుల‌కు సీఎం కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. జూన్ నుంచి ఇక్క‌డి నుంచే ప‌రిపాల‌న సాగిస్తామ‌న్నారు. అ అంటే అమరావతి అని భవిష్యత్తులో చదువుకునేలా రాజధాని నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ప్రపంచంలోని 10 ఉన్నతమైన రాజధానిల్లో ఒకటిగా అమరావతిని నిలుస్తుందన్నారు. 2019లో కూడా లోటు బడ్జెట్‌ ఉండే పరిస్థితి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. అభివృద్ధి నిరోధకులుగా విపక్షాలు మారాయని ధ్వజమెత్తారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి నేతలను చూడలేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News