ప్రమోషన్‌ కోసం నగ్నపూజలు

తమిళనాడు ధర్మపురిలోని ఒక కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సెల్వరాజ్‌ ఎన్నిప్రయత్నాలుచేసినా ‘డీన్‌’ పదవి దక్కకపోవడంతో ఒక క్షుద్రపూజారిని కలిశాడు. ఆయన సలహామేరకు ఇక క్షుద్రపూజలే దిక్కు అనుకున్నట్టున్నాడు. భార్య నిద్రపోయాక తను దేవుని గదిలో బట్టలు మొత్తం విప్పేసి పూర్తి నగ్నంగా పూజలు చేసేవాడు. అది తెలిసిన భార్య ఆశ్చర్యపోయి భర్తను నిలదీసింది. డీన్‌ పదవికోసం ఈ పూజలు చేస్తున్నానని ఆమెను ఒప్పించాడు. ఎన్నిరోజులు నగ్నపూజలు చేసినా డీన్‌ పదవి రాకపోయేసరికి మళ్లీ ఆ క్షుద్రపూజారిని కలిశాడు. […]

Advertisement
Update: 2016-02-12 21:00 GMT

తమిళనాడు ధర్మపురిలోని ఒక కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సెల్వరాజ్‌ ఎన్నిప్రయత్నాలుచేసినా ‘డీన్‌’ పదవి దక్కకపోవడంతో ఒక క్షుద్రపూజారిని కలిశాడు. ఆయన సలహామేరకు ఇక క్షుద్రపూజలే దిక్కు అనుకున్నట్టున్నాడు. భార్య నిద్రపోయాక తను దేవుని గదిలో బట్టలు మొత్తం విప్పేసి పూర్తి నగ్నంగా పూజలు చేసేవాడు. అది తెలిసిన భార్య ఆశ్చర్యపోయి భర్తను నిలదీసింది.

డీన్‌ పదవికోసం ఈ పూజలు చేస్తున్నానని ఆమెను ఒప్పించాడు. ఎన్నిరోజులు నగ్నపూజలు చేసినా డీన్‌ పదవి రాకపోయేసరికి మళ్లీ ఆ క్షుద్రపూజారిని కలిశాడు. ఆయన సలహామేరకు భార్యను కూడా నగ్నంగా తనతో పూజలు చేయాలని ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించకపోయేసరికి ఆమెను చితకొట్టాడు. ఆమె హాస్పటల్లో చేరింది. దెబ్బలెందుకు తగిలాయని డాక్టర్లు అడిగేసరికి కథ అంతా చెప్పింది. ఇప్పుడు ఈ ప్రొఫెసర్‌ నిర్వాకం తమిళనాడులో సంచలనం అయింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News