మరికొన్నిగంటల్లో పవర్ సంక్రాంతి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న సంక్రాంతి మరికొన్ని గంటల్లో రాబోతోంది. వాళ్లకు థియేటర్లలో  ఉన్న సినిమాలతో పనిలేదు. పవన్ విడుదల చేయనున్న ట్రయిలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ వస్తుందా రాదా అనుకున్న పవన్… సర్దార్ గబ్బర్ సింగ్ ట్రయిలర్… మరికొన్ని గంటల్లో సంక్రాంతి స్పెషల్ గా రాబోతోంది. ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాత శరత్ మరార్ ఫుల్లుగా కన్ ఫర్మ్ చేశాడు. కేవలం న్యూస్ చెప్పడమే కాదు… […]

Advertisement
Update: 2016-01-12 19:03 GMT
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న సంక్రాంతి మరికొన్ని గంటల్లో రాబోతోంది. వాళ్లకు థియేటర్లలో ఉన్న సినిమాలతో పనిలేదు. పవన్ విడుదల చేయనున్న ట్రయిలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ వస్తుందా రాదా అనుకున్న పవన్… సర్దార్ గబ్బర్ సింగ్ ట్రయిలర్… మరికొన్ని గంటల్లో సంక్రాంతి స్పెషల్ గా రాబోతోంది. ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాత శరత్ మరార్ ఫుల్లుగా కన్ ఫర్మ్ చేశాడు. కేవలం న్యూస్ చెప్పడమే కాదు… ఆ న్యూస్ తో పాటు సర్దార్ గబ్బర్ సింగ్ కు సంబంధించిన మరో స్టిల్ కూడా విడుదల చేసి కాక పుట్టించాడు. వస్తుందా రాదా అనుకున్న ట్రయిలర్ వస్తుండడంతో పవనిజం సందడి కనిపిస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ కు సంబంధించి ఇప్పటికే ఓ టీజర్ విడుదలైంది. అయితే అందులో కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఉంది. అయితే సంక్రాంతి కానుకగా వస్తున్న రెండో టీజర్ లో మాత్రం ఓ పవర్ ఫుల్ డైలాగ్ ను చొప్పించబోతున్నారు. సో… గెట్ రెడీ టు పవర్ సంక్రాంతి
Tags:    
Advertisement

Similar News