మా ఆయన ఏడ్చారు, కూతురు సినిమాల్లోకి రాదు, నేను నటించను

తన కూతురు త్వరలో సినిమాల్లోకి వస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని రోజా తోసిపుచ్చారు. కూతురుని సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తన కూతురు చాలా చిన్న అమ్మాయి అని, ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోందని చెప్పారు. సైంటిస్ట్ అవ్వాలన్నది తన కూతురు కోరిక అని అన్నారు. కూమారుడికి మాత్రం సినిమాలంటే పిచ్చి అని చెప్పారు. అతడి అదృష్టం ఎలా ఉందో చూడాలన్నారు.  భర్త తనను ఎంతో ప్రోత్సహిస్తున్నారన్నారు. కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి కావడంతో రాజకీయాల్లో […]

Advertisement
Update: 2015-12-27 18:45 GMT

తన కూతురు త్వరలో సినిమాల్లోకి వస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని రోజా తోసిపుచ్చారు. కూతురుని సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తన కూతురు చాలా చిన్న అమ్మాయి అని, ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోందని చెప్పారు. సైంటిస్ట్ అవ్వాలన్నది తన కూతురు కోరిక అని అన్నారు. కూమారుడికి మాత్రం సినిమాలంటే పిచ్చి అని చెప్పారు. అతడి అదృష్టం ఎలా ఉందో చూడాలన్నారు.

భర్త తనను ఎంతో ప్రోత్సహిస్తున్నారన్నారు. కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి కావడంతో రాజకీయాల్లో ముందుకెళ్లేందుకు తనను బాగా ప్రోత్సహించారన్నారు. ఎంతో ధైర్యవంతుడైనప్పటికీ మొన్నటి అసెంబ్లీ సమావేశాల సమయంలో తనను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం చూసి ఏడ్చారని రోజా చెప్పారు. Click to Read: మోదీ, స్మృతి భార్యాభర్తలట!

Click to Read రోజా ఎపిసోడ్‌పై నిఘా వర్గాలు ఏం చెప్పాయి?

సినిమాల్లో ఇకపై నటించే ఆలోచన లేదన్నారు రోజా. ఎమ్మెల్యేగా ప్రజాసమస్యలపై తక్షణం స్పందించాల్సి ఉంటుందని కాబట్టి షూటింగ్‌లకు ఆటంకం ఏర్పడుతుందని చెప్పారు. అందుకే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు రోజా వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News