సెలైన్‌లో పురుగుల మందు ఎక్కించిన భర్తకు జీవిత ఖైదు

సెలైన్‌లో విషం ఎక్కించి భార్యను చంపిన వ్యక్తికి గుంటూరు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. 500 జరిమానా విధించింది. భార్యకు సెలైన్‌ ద్వారా విషయం ఎక్కించిన ఈ ఘటన 2013లో గుంటూరుజిల్లా బొల్లాపల్లి మండలం కనుమలచెర్వులో జరిగింది. రవికుమార్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. భార్య విమలమ్మపై తొలి నుంచి రవికుమార్ అనుమానం పెంచుకున్నాడు. 2013 అక్టోబర్‌ 4న వినుకొండలోని ఒక ఆస్పత్రిలో విమలక్క ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఆమెకు వైద్యులు […]

Advertisement
Update: 2015-12-03 09:53 GMT

సెలైన్‌లో విషం ఎక్కించి భార్యను చంపిన వ్యక్తికి గుంటూరు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. 500 జరిమానా విధించింది. భార్యకు సెలైన్‌ ద్వారా విషయం ఎక్కించిన ఈ ఘటన 2013లో గుంటూరుజిల్లా బొల్లాపల్లి మండలం కనుమలచెర్వులో జరిగింది. రవికుమార్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

భార్య విమలమ్మపై తొలి నుంచి రవికుమార్ అనుమానం పెంచుకున్నాడు. 2013 అక్టోబర్‌ 4న వినుకొండలోని ఒక ఆస్పత్రిలో విమలక్క ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఆమెకు వైద్యులు సెలైన్ ఎక్కించారు. ఎవరూ లేనిది గమనించిన రవికుమార్ వెళ్లి సెలైన్ బాటిల్‌లోకి పురుగుల మందును ఇంజెక్షన్ ద్వారా కలిపాడు. అది నేరుగా ఆమె శరీరంలోకి వెళ్లిపోయింది. కాసేపటి ఆమె పరిస్థితిని గమనించి వైద్యులు మెరుగైన వైద్యం కోసం మరొక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో మరణవాంగ్మూలం ఇచ్చి విమలక్క చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో కూడా నేరం రవికుమారే చేసినట్టు తేలింది. దీంతో రవికుమార్‌కు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు చెప్పింది.

Tags:    
Advertisement

Similar News