జీవిత రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కు  కోర్టు  కేసు లో ఊర‌ట‌

చెక్ బౌన్స్ కేసులో సినీనటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ కు ఊరట లభించింది. ఆమెపై ఉన్న చెక్ బౌన్సు కేసును ఎర్రమంజిల్ కోర్టు శనివారం కొట్టేసింది. ఈ సందర్భంగా జీవితా మాట్లాడుతూ తనను కోర్టుకు లాగిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని, కావాలనే తన దగ్గర నుంచి చెక్ లు తీసుకుని, కేసులో ఇరికించారని  ఆరోపించారు. తనపై కేసు కొట్టివేయడం సంతోషంగా ఉందన్నారు. Click to Read: ఎంపీగారి మామిడితోటలో…. కాగా జీవితా రాజశేఖర్ 2007లో […]

Advertisement
Update: 2015-11-28 04:02 GMT

చెక్ బౌన్స్ కేసులో సినీనటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ కు ఊరట లభించింది. ఆమెపై ఉన్న చెక్ బౌన్సు కేసును ఎర్రమంజిల్ కోర్టు శనివారం కొట్టేసింది. ఈ సందర్భంగా జీవితా మాట్లాడుతూ తనను కోర్టుకు లాగిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని, కావాలనే తన దగ్గర నుంచి చెక్ లు తీసుకుని, కేసులో ఇరికించారని ఆరోపించారు. తనపై కేసు కొట్టివేయడం సంతోషంగా ఉందన్నారు.

Click to Read: ఎంపీగారి మామిడితోటలో….

కాగా జీవితా రాజశేఖర్ 2007లో ‘ఎవడైతే నాకేంటి’ అనే సినిమా నిర్మించారు. ఇందుకోసం సామ శేఖర్ రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడికి ఇచ్చిన చెక్‌ బౌన్స్ కావటంతో కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు 2014లో జీవితకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధించింది. అనంతరం ఆమె బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఎర్రమంజిల్ కోర్టు తీర్పుపై సామ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… జీవితా రాజశేఖర్ పై హైకోర్టులో అప్పీల్ చేస్తామన్నారు.

Click to Read: Jeevitha Rajasekhar gets relief from court

Tags:    
Advertisement

Similar News