అవార్డుల వాపస్‌పై నోరువిప్పిన రాష్ట్రపతి ప్రణబ్‌

దేశంలో పరమత ‘అసహనం’పై కేంద్రానికి నిరసన వ్యక్తం చేస్తూ అవార్డులు తిరిగి ఇచ్చేయడాన్ని రాష్ట్రపతి పరోక్షంగా తప్పు పట్టారు. సమాజంలో కొన్ని సంఘటనలకు స్పందించడం సహజమని, సున్నిత మనస్కులు ఇలాంటి విషయాల్లో మరింత ముందుటారని ఆయన అన్నారు. అయితే భావోద్వేగాలు హేతుబద్దతను డామినేట్‌ చేసేట్టుగా ఉండకూడదని, దానివల్ల సమస్యలు పరిష్కారం కావని ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ప్రెస్‌ డే సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ నిరసన వ్యక్తం చేయడానికి అనేక మార్గాలు ఉంటాయని, ఇందులో చర్చలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్న […]

Advertisement
Update: 2015-11-16 12:22 GMT

దేశంలో పరమత ‘అసహనం’పై కేంద్రానికి నిరసన వ్యక్తం చేస్తూ అవార్డులు తిరిగి ఇచ్చేయడాన్ని రాష్ట్రపతి పరోక్షంగా తప్పు పట్టారు. సమాజంలో కొన్ని సంఘటనలకు స్పందించడం సహజమని, సున్నిత మనస్కులు ఇలాంటి విషయాల్లో మరింత ముందుటారని ఆయన అన్నారు. అయితే భావోద్వేగాలు హేతుబద్దతను డామినేట్‌ చేసేట్టుగా ఉండకూడదని, దానివల్ల సమస్యలు పరిష్కారం కావని ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ప్రెస్‌ డే సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ నిరసన వ్యక్తం చేయడానికి అనేక మార్గాలు ఉంటాయని, ఇందులో చర్చలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్న విషయం గుర్తుంచు కోవాలని రాష్ట్రపతి సూచించారు. పలువురు రచయితలు, కళాకారులు, సినీ ప్రముఖులు అవార్డులు ప్రతిభకు గుర్తింపుగా పొందాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, అవి తమకు లబించిన గౌరవంగా భావించాలని, అంతేకాని వాటిని వాపస్‌ చేయడం సరికాదని పరోక్షంగా అన్నారు.

తమ అసమ్మతిని చర్చలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తం చేయడం ఒక మార్గమైతే దాన్ని సరైన దిశలో ఆవిష్కరించడం మరో మార్గమని రాష్ట్రపతి ప్రణబ్‌ హితవు చెప్పారు. అలాగే తప్పులు చేయడం సహజమని, సమయం వచ్చినప్పుడు ఆత్మవిమర్శ చేసుకుని వాటిని సరిదిద్దుకోవాలని, ఈ విషయంలో భారత్‌ ఎప్పుడూ ముందుంటుందనేది తన స్వీయానుభవమని ఆయన పరోక్షంగా ఎన్డీయే ప్రభుత్వానికి చురక అంటించారు. 21వ శతాబ్దంలో భారత్‌ శక్తిమంతంగా రూపొందడానికి పత్రికా వ్యవస్థ గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రజా ప్రయోజనాలు రక్షించడంలో, అణగారిన వర్గాలను సమసమాజంలోకి తీసుకురావడంలోను మీడియా పాత్ర అత్యంత కీలకమైనదని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హితవు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News