సొంతపార్టీ ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న విజయ్‌కాంత్‌

తాను చెబుతున్న తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించిన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేపైనే చేయి చేసుకున్నాడు డీఎండీకే పార్టీ అధ్యక్షుడు, తమిళ నటుడు విజయకాంత్‌. తమిళనాడును ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తాయి. దీనివల్ల సర్వస్వం కోల్పోయిన బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళిన ఆయన కడలూరు జిల్లా బన్‌రుట్టిలో జరుగుతున్న ఓ సమావేశంలో ప్రసంగిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో అక్కడున్న నాయకుల పేర్లు తప్పుగా చెబుతున్నారు. దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే శివకుళందైని టపటపా రెండు పీకారు. నా ప్రసంగానికి అడ్డు […]

Advertisement
Update: 2015-11-15 12:51 GMT

తాను చెబుతున్న తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించిన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేపైనే చేయి చేసుకున్నాడు డీఎండీకే పార్టీ అధ్యక్షుడు, తమిళ నటుడు విజయకాంత్‌. తమిళనాడును ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తాయి. దీనివల్ల సర్వస్వం కోల్పోయిన బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళిన ఆయన కడలూరు జిల్లా బన్‌రుట్టిలో జరుగుతున్న ఓ సమావేశంలో ప్రసంగిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో అక్కడున్న నాయకుల పేర్లు తప్పుగా చెబుతున్నారు. దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే శివకుళందైని టపటపా రెండు పీకారు. నా ప్రసంగానికి అడ్డు తగులుతావా అంటూ చెంప మీద ఒకటి, నెత్తి మీద మరొకటి వేశారు. విజయ్‌కాంత్ ఈ తరహాలో ప్రవర్తించడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇదే ఎమ్మెల్యేపై ఎన్నికల ప్రచారంలో చేయి చేసుకుని ఆ తర్వాత తీరిగ్గా సారీ చెప్పారు. 2011లో విరుదాచలంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించారు. కాగా విజయ్‌కాంత్ ప్రవర్తన పట్ల సొంత పార్టీ నేతలే చాలా అసహనంతో ఉన్నట్టు తెలిసింది. సాటి ఎమ్మెల్యేను, ఒక నియోజకవర్గానికి నాయకుడిని ఈ విధంగా కొట్టడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. చేసిన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యేపై చేయి చేసుకోవడమేమిటి అంటూ వారు తమలోతాము ప్రశ్నించుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News