ఆయుధంతో కాదు... అభివృద్ధితోనే మావోలకు చెక్‌

మావోయిస్టుల సమస్య ఆయుధంతో కాకుండా అభివృద్ధితోనే పరిష్కారం కాగలదని చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణసింగ్‌ చెప్పారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని, బస్తర్‌ ప్రాంత ప్రజలు ఇపుడు అభివృద్ధిని కోరుకుంటున్నారని, వారు పాఠశాలలు, మంచి రోడ్లు, రవాణా సౌకర్యాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ మెరుగుగా ఉండాలని అభిప్రాయపడుతున్నారని తెలిపారు. ఇంతవరకు తాము, తమ ప్రాంతం ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదో ఇపుడు వారు అర్ధం చేసుకుంటున్నారని రమణసింగ్‌ అన్నారు. దంతెవాడ, బస్తర్‌ జిల్లాల్లో స్థానికులపై పెత్తనం సాగిస్తూ నక్సల్స్‌ మనుగడ సాగిస్తున్నారని […]

Advertisement
Update: 2015-11-13 10:25 GMT

మావోయిస్టుల సమస్య ఆయుధంతో కాకుండా అభివృద్ధితోనే పరిష్కారం కాగలదని చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణసింగ్‌ చెప్పారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని, బస్తర్‌ ప్రాంత ప్రజలు ఇపుడు అభివృద్ధిని కోరుకుంటున్నారని, వారు పాఠశాలలు, మంచి రోడ్లు, రవాణా సౌకర్యాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ మెరుగుగా ఉండాలని అభిప్రాయపడుతున్నారని తెలిపారు. ఇంతవరకు తాము, తమ ప్రాంతం ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదో ఇపుడు వారు అర్ధం చేసుకుంటున్నారని రమణసింగ్‌ అన్నారు. దంతెవాడ, బస్తర్‌ జిల్లాల్లో స్థానికులపై పెత్తనం సాగిస్తూ నక్సల్స్‌ మనుగడ సాగిస్తున్నారని తెలిపారు. ఈ జిల్లాల్లో అభివృద్ధి పథకాలు అమలు చేయడం ద్వారా ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం చూరగొంటుందని, అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి అక్కడ ప్రజలు కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారని ముఖ్యమంత్రి రమణసింగ్‌ తెలిపారు. సాయుధులను ప్రయోగించడం ద్వారా నక్సల్స్‌ని అణిచి వేయాలని ప్రభుత్వం భావించడం లేదని, గత పన్నెండు సంవత్సరాల నుంచి రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న చత్తీస్‌గఢ్‌ ఇపుడు అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతోందని, ముఖ్యంగా విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంలో ఈ రాష్ట్రం అగ్రగామిగా ఉందని రమణసింగ్‌ తెలిపారు. విద్యుదుత్పత్తి సామర్థ్యం 4000 మెగావాట్లకు పెరిగిందని, ఇదే సమయంలో తలసరి వినియోగం కూడా 670 యూనిట్ల నుంచి 1560 యూనిట్లకు పెరిగిందని తెలిపారు. ఇది జాతీయ సగటు కన్నా చాలా ఎక్కువని చెప్పారు. ఆహార భద్రత, ప్రజా పంపిణీ వ్యవస్థల స్థితి అద్భుతంగా మెరుగుపడడం కూడా తమ రాష్ట్ర ఘనతగా చెప్పవచ్చని ఆయన తెలిపారు. ఇవన్నీ నక్సలిజం రూపు మాపడంలో విశేషపాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News