సచిన్‌కు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ అవమానం

ఇండియన్‌ క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ తీవ్రంగా అవమానించింది. విమానంలో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ తన కుటుంబ సభ్యుల టికెట్లను కన్‌ఫం చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. పైగా ఆయన దిగేటప్పుడు లగేజ్‌ మిస్‌ ప్లేస్‌ అయినప్పటికీ సరిగా స్పందించకుండా అవమానించింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సచిన్‌ టెండూల్కర్‌ దీన్ని తీవ్ర అవమానంగా భావించాడు. అంతటితో వదిలి వేయకుండా సోషల్‌ మీడియాలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టాడు. తన లగేజీ తనకు […]

Advertisement
Update: 2015-11-13 11:12 GMT

ఇండియన్‌ క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ తీవ్రంగా అవమానించింది. విమానంలో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ తన కుటుంబ సభ్యుల టికెట్లను కన్‌ఫం చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. పైగా ఆయన దిగేటప్పుడు లగేజ్‌ మిస్‌ ప్లేస్‌ అయినప్పటికీ సరిగా స్పందించకుండా అవమానించింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సచిన్‌ టెండూల్కర్‌ దీన్ని తీవ్ర అవమానంగా భావించాడు. అంతటితో వదిలి వేయకుండా సోషల్‌ మీడియాలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టాడు. తన లగేజీ తనకు అప్పగించడానికి ఆయన చిరునామా, తదితర వివరాలను అందజేయాలని కోరడంతో మరింత కుంగిపోయాడు సచిన్‌. అసలు తనెవరో తెలియనట్టు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ అధికారులు ప్రవర్తించడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆయన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్ తీరును, దాని చెత్త పనితీరును, అధికారుల వ్యవహారశైలిని నిశితంగా వివరిస్తూ సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఈ విషయం అభిమానులకు తెలిసి ఆగ్రహోదగ్రులయ్యారు. ఈ ఎయిర్‌వేస్‌ నిర్వాకంపై విరుచుకుపడ్డారు. దీంతో దిగివచ్చిన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ క్షమాపణలు చెప్పింది.

Tags:    
Advertisement

Similar News