బాద్‌షాను వెంటాడుతున్న ఈడీ

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు ఈడీ కష్టాలు వీడడం లేదు.  విదేశీ మారకద్రవ్యం విషయంలో వందకోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలపై మూడు గంటల పాటు షారుక్‌ను ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనలను షారుక్‌  ఉల్లంఘించారని ఈడీ ఆడిట్ తేల్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్  షేర్లను మారిషస్‌కు చెందిన జై మెహతా కంపెనీకి విక్రయించడంలో అవకతవకలు జరిగాయంటూ షారూక్‌కు మూడుసార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. షేర్ల విలువను భారీగా తగ్గించి 80 రూపాయల […]

Advertisement
Update: 2015-11-11 06:51 GMT

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు ఈడీ కష్టాలు వీడడం లేదు. విదేశీ మారకద్రవ్యం విషయంలో వందకోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలపై మూడు గంటల పాటు షారుక్‌ను ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనలను షారుక్‌ ఉల్లంఘించారని ఈడీ ఆడిట్ తేల్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లను మారిషస్‌కు చెందిన జై మెహతా కంపెనీకి విక్రయించడంలో అవకతవకలు జరిగాయంటూ షారూక్‌కు మూడుసార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది.

షేర్ల విలువను భారీగా తగ్గించి 80 రూపాయల షేర్ ధరను… పదిరూపాయలుగా చూపాడని ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో షారుక్‌ను ఈడీ విచారించింది. అయితే తాను ఎలాంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడలేదని ఈడీ అధికారులతో షారుక్ చెప్పినట్టు సమాచారం.

Tags:    
Advertisement

Similar News