బాబాయి- అబ్బాయి సంక్రాంతి పందెం కోళ్లు
ఈ సారి సంక్రాంతికి జూనియర్ ఎన్టీఆర్, బాబాయి బాలక్రిష్ణల మధ్య పోరు తప్పేలా లేదు. నాన్నకు ప్రేమతో సినిమా జనవరి 8న వస్తుందని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు కూడా. అయితే, అదే సమయానికి బాలయ్య సినిమా డిక్టేటర్ ను కూడా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతి బరిలో నిలపాలని బాలయ్య పట్టుదలతో ఉన్నాడంట. అందుకే ఈ సినిమా షూటింగును రెండు యూనిట్లతో చకచకా నడిపిస్తున్నారని సమాచారం. అయినప్పటికీ చిత్రం టాకీ కనీసం 40 […]
Advertisement
ఈ సారి సంక్రాంతికి జూనియర్ ఎన్టీఆర్, బాబాయి బాలక్రిష్ణల మధ్య పోరు తప్పేలా లేదు. నాన్నకు ప్రేమతో సినిమా జనవరి 8న వస్తుందని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు కూడా. అయితే, అదే సమయానికి బాలయ్య సినిమా డిక్టేటర్ ను కూడా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతి బరిలో నిలపాలని బాలయ్య పట్టుదలతో ఉన్నాడంట. అందుకే ఈ సినిమా షూటింగును రెండు యూనిట్లతో చకచకా నడిపిస్తున్నారని సమాచారం. అయినప్పటికీ చిత్రం టాకీ కనీసం 40 శాతం కూడా దాటకపోవడంతో బాలయ్య దర్శకుడు శ్రీవాస్ని పిలిపించారంట. ఎట్టి పరిస్థితుల్లో సినిమా సంక్రాంతికి విడుదలవ్వాలి అని స్పష్టం చేయడంతో శ్రీవాస్ వేగం పెంచాడట. దీంతో సినిమా షూటింగ్ ఉరుకుల పరుగుల మీద జరుగుతోంది. మరోవైపు నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది.
పోటీ తప్పదా?
తెలుగు ఇండస్ర్టీలో సంక్రాంతి హీరోగా పరిశ్రమలో బాలయ్యకు మంచి రికార్డు ఉంది. బాలయ్య సినిమా సంక్రాంతి బరిలో ఉంటే చాలామంది తమ సినిమాలను వాయిదా వేసుకుంటారు. బాలయ్య గత రికార్డులు అలాంటివి మరి. అలాంటిది ఈసారి నాన్నకు ప్రేమతో సినిమాను జనవరి 8కి ఆల్రెడీ అనౌన్స్ చేశారు నిర్మాతలు. ఇకపోతే 14 తేదీకి అటూ ఇటూగా డిక్టేటర్ సినిమా రానుంది. దీంతో ఇతర హీరోల మాట అటుంచితే.. ఒకే కుటుంబానికి చెందిన బాబాయి- అబ్బాయిల మధ్య పోరు తప్పేలా లేదు. నందమూరి అభిమానులు ఇక్కడే సందిగ్దంలో పడే అవకాశం ఉంది. ఏ సినిమా ఆడకపోయినా నీరుగారిపోయేది వారే..! ఒకేసారి రెండు సినిమాలను హిట్ చేయడం అంత వీజీ కాదని వారికీ తెలుసు. అందుకే ఎవరో ఒకరు తప్పుకుంటే.. మంచిదని సూచిస్తున్నారు. రెండు సినిమాలకు మధ్య కనీసం రెండు వారాల సమయం అయినా ఉంటే బెటరని చెబుతున్నారు. లేకుంటే వసూళ్ల పరంగా నిర్మాతలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబాయి- అబ్బాయిలో ఎవరు వెనక్కి తగ్గుతారన్నది ఇప్పుడు ఇండస్ర్టీలో హాట్ టాపిక్ గా మారింది.
Advertisement