ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించిన కేంద్రం

ఆర్థిక సంస్కరణల్లో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగంతోపాటు 15 రంగాల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించాలని నిర్ణయించింది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం పరిమితిని కూడా పెంచాలని భావించింది. ఇందుకు అనుగుణంగా ఈ పరిమితిని మూడు వేల కోట్ల రూపాయల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలకు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించి త్వరలోనే అధికార ప్రకటన వెలువడనుంది. ఆర్ధిక సంస్కరణలపై బీహార్‌ […]

Advertisement
Update: 2015-11-10 07:34 GMT

ఆర్థిక సంస్కరణల్లో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగంతోపాటు 15 రంగాల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించాలని నిర్ణయించింది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం పరిమితిని కూడా పెంచాలని భావించింది. ఇందుకు అనుగుణంగా ఈ పరిమితిని మూడు వేల కోట్ల రూపాయల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలకు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించి త్వరలోనే అధికార ప్రకటన వెలువడనుంది. ఆర్ధిక సంస్కరణలపై బీహార్‌ ఎన్నికల ప్రభావం ఉండదని అంతకుముందు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. గతంలోనే రైల్వే, మీడియా రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించినప్పటికీ అంత ప్రభావవంతంగా విదేశీ పెట్టుబడులను కేంద్రం ఆకర్షించలేకపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపును మరో 15 రంగాలకు విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags:    
Advertisement

Similar News