మరో బయోపిక్ లో విద్యాబాలన్

విద్యాబాలన్ నటించిన  డర్టీ పిక్చర్ ఏ రేంజ్ లో హిట్టయిందో అందరికీ తెలిసిందే. సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఆ బయోపిక్ లో విద్యాబాలన్ రెచ్చిపోయింది. అప్పటివరకు చూపించని ఎక్స్ ప్రెషన్స్ తో కవ్వించింది. టోటల్ గా సినిమా సూపర్ హిట్టయింది. అయితే ఆ తర్వాత మళ్లీ మరో బయోపిక్ లో కనిపించలేదు విద్యాబాలన్. మళ్లీ ఇన్నాళ్లకు ఆమెను మరో ఆటోబయోగ్రఫీలో చూపించడానికి సిద్ధమౌతున్నాడు ఓ మలయాళ దర్శకుడు. ప్రముఖ ఇండియన్-ఇంగ్లిష్ రచయిత్రి మాధవి […]

Advertisement
Update: 2015-11-08 19:21 GMT
విద్యాబాలన్ నటించిన డర్టీ పిక్చర్ ఏ రేంజ్ లో హిట్టయిందో అందరికీ తెలిసిందే. సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఆ బయోపిక్ లో విద్యాబాలన్ రెచ్చిపోయింది. అప్పటివరకు చూపించని ఎక్స్ ప్రెషన్స్ తో కవ్వించింది. టోటల్ గా సినిమా సూపర్ హిట్టయింది. అయితే ఆ తర్వాత మళ్లీ మరో బయోపిక్ లో కనిపించలేదు విద్యాబాలన్. మళ్లీ ఇన్నాళ్లకు ఆమెను మరో ఆటోబయోగ్రఫీలో చూపించడానికి సిద్ధమౌతున్నాడు ఓ మలయాళ దర్శకుడు. ప్రముఖ ఇండియన్-ఇంగ్లిష్ రచయిత్రి మాధవి కుట్టి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని, విద్యాబాలన్ లీడ్ రోల్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రముఖ మలయాళ దర్శకుడు జేసీ డానియర్ ఈ బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేది అనుమానమే అంటున్నారు చాలామంది. ఎందుకంటే.. గతంలోనే ఇతడి దర్శకత్వంలో మోహన్ లాల్-విద్యాబాలన్ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. కాబట్టి ఈసారి మరోసారి ఈ దర్శకుడితో కలిసి పనిచేసే విషయాన్ని విద్యాబాలన్ ఒకటికి రెండుసార్లు ఆలోచించడం ఖాయం.
Tags:    
Advertisement

Similar News