ఒకటి విడుదలైతే..మరోటి పట్టాలపైకి

జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న రవితేజ. కిక్-2 సినిమా ఫ్లాప్ అయినా మాస్ రాజా స్పీడ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే బెంగాల్ టైగర్ ను పూర్తిచేసిన రవితేజ, త్వరలోనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు. ఓవైపు బెంగాల్ టైగర్ మూవీ ఈనెల 27న విడుదలకు సిద్ధమౌతుంటే.. అంతకంటే ముందే కొత్త సినిమాను పట్టాలపైకి తీసుకొస్తున్నాడు రవితేజ. దిల్ రాజు బ్యానర్ పై వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఎవడో ఒకడు అనే సినిమాను ఇప్పటికే ప్రారంభించాడు రవితేజ. […]

Advertisement
Update: 2015-11-08 19:22 GMT
జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న రవితేజ. కిక్-2 సినిమా ఫ్లాప్ అయినా మాస్ రాజా స్పీడ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే బెంగాల్ టైగర్ ను పూర్తిచేసిన రవితేజ, త్వరలోనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు. ఓవైపు బెంగాల్ టైగర్ మూవీ ఈనెల 27న విడుదలకు సిద్ధమౌతుంటే.. అంతకంటే ముందే కొత్త సినిమాను పట్టాలపైకి తీసుకొస్తున్నాడు రవితేజ.
దిల్ రాజు బ్యానర్ పై వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఎవడో ఒకడు అనే సినిమాను ఇప్పటికే ప్రారంభించాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. ప్రేమమ్ అనే హిట్ మలయాళ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ను ఇందులో కూడా హీరోయిన్ గా తీసుకున్నాడు. మరో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. మరోవైపు ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత దేవిశ్రీప్రసాద్, రవితేజ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను నాన్ స్టాప్ గా కంటిన్యూ చేసి, సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేయాలనుకుంటున్నారు.
Tags:    
Advertisement

Similar News