సర్దార్ సెట్స్ లో పవన్ కూతుళ్ళు

ప్రస్తుతం హైదరాబాద్ లో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతోంది. పవన్ కల్యాణ్ తో పాటు కొంతమంది హాస్యనటులపై కొన్ని కామెడీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇంతలో సర్దార్ సెట్స్ లోకి ఊహించని విధంగా ఇద్దరు ప్రత్యక అతిథులు దూసుకొచ్చారు. వస్తూనే పవన్ ను చుట్టేశారు. వాళ్లే పవన్ కూతుళ్లు. అవును.. పవన్ కల్యాణ్ కూతుర్లు ఇద్దరూ సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో సందడి చేశారు. రోజంతా సెట్ లోనే ఉన్నారు. అక్కడే ఆడుకున్నారు. అక్కడే తిని, […]

Advertisement
Update: 2015-11-06 19:05 GMT
ప్రస్తుతం హైదరాబాద్ లో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతోంది. పవన్ కల్యాణ్ తో పాటు కొంతమంది హాస్యనటులపై కొన్ని కామెడీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇంతలో సర్దార్ సెట్స్ లోకి ఊహించని విధంగా ఇద్దరు ప్రత్యక అతిథులు దూసుకొచ్చారు. వస్తూనే పవన్ ను చుట్టేశారు. వాళ్లే పవన్ కూతుళ్లు. అవును.. పవన్ కల్యాణ్ కూతుర్లు ఇద్దరూ సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో సందడి చేశారు. రోజంతా సెట్ లోనే ఉన్నారు. అక్కడే ఆడుకున్నారు. అక్కడే తిని, అక్కడే పడుకున్నారు. మధ్యమధ్యలో పవన్ వచ్చి వాళ్లతో ఆడుకున్నాడు. ఇలా సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ అంతా ఒకటే సందడిసందడి. పిల్లల రాకతో అంతా హుషారు అయిపోయారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. మరికొన్ని రోజుల పాటు సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ హైదరాబాద్ లోనే ఉంటుంది. దీపావళిని ఇక్కడే సెలబ్రేట్ చేసుకొని, ఈనెల 17 నుంచి తిరిగి గుజరాత్ లో షూటింగ్ ప్రారంభమౌతుంది.
Tags:    
Advertisement

Similar News