ఎయిర్‌పోర్టులో మళ్లీ యూజర్‌ చార్జీల బాదుడు

హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్లీ యూజర్‌ చార్జీల మోత ప్రారంభమైంది. సర్వీస్‌ చార్జితో కలిపి ఒక్కో దేశీయ ప్రయాణికుడి నుంచి 430 రూపాయలు, అంతర్జాతీయ ప్రయాణికుడి నుంచి 1,700 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టును డెవలప్‌ చేసిన జిఎంఆర్‌ గ్రూపు ప్రారంభం నుంచే యూజర్‌ చార్జీలు వసూలు చేసేది. ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎఇఆర్‌ఎ) ఇది చట్టవిరుద్ధమని ఆదేశించడంతో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి వీటి వసూలును నిలిపివేశారు. జిఎంఆర్‌ గ్రూపు […]

Advertisement
Update: 2015-11-04 21:35 GMT

హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్లీ యూజర్‌ చార్జీల మోత ప్రారంభమైంది. సర్వీస్‌ చార్జితో కలిపి ఒక్కో దేశీయ ప్రయాణికుడి నుంచి 430 రూపాయలు, అంతర్జాతీయ ప్రయాణికుడి నుంచి 1,700 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టును డెవలప్‌ చేసిన జిఎంఆర్‌ గ్రూపు ప్రారంభం నుంచే యూజర్‌ చార్జీలు వసూలు చేసేది. ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎఇఆర్‌ఎ) ఇది చట్టవిరుద్ధమని ఆదేశించడంతో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి వీటి వసూలును నిలిపివేశారు. జిఎంఆర్‌ గ్రూపు ఈ విషయాన్ని సవాల్‌ చేయగా ఉమ్మడి హైకోర్టు ఇటీవలే ఎఇఆర్‌ఎ ఆదేశాలను కొట్టివేసింది. దీంతో ఈ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించి అమలులోకి తీసుకువచ్చింది.

Tags:    
Advertisement

Similar News