'అసహనం'పై షారూక్‌ వ్యాఖ్యలకు శివసేన బాసట

మత ‘అసహనం’పై బహిరంగ వ్యాఖ్యలు చేసిన బాలివుడ్‌ సినీ హీరో షారూక్‌ ఖాన్‌పై బీజేపీ ఆగ్రహావేశాలు వెళ్ళగక్కుతుండగా ఎప్పుడూ అతన్ని టార్గెట్‌ చేసే శివసేన మాత్రం ఈసారి అండగా నిలబడి సంచలనం సృష్టించింది. ఒక్క శివసేనే కాదు ఆయనకు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా మద్దతుగా నిలిచారు. కేవలం ముస్లిం అయినందున మాత్రమే షారూక్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం అవివేకమని శివసేన నాయకుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్ అన్నారు. […]

Advertisement
Update: 2015-11-04 08:56 GMT

మత ‘అసహనం’పై బహిరంగ వ్యాఖ్యలు చేసిన బాలివుడ్‌ సినీ హీరో షారూక్‌ ఖాన్‌పై బీజేపీ ఆగ్రహావేశాలు వెళ్ళగక్కుతుండగా ఎప్పుడూ అతన్ని టార్గెట్‌ చేసే శివసేన మాత్రం ఈసారి అండగా నిలబడి సంచలనం సృష్టించింది. ఒక్క శివసేనే కాదు ఆయనకు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా మద్దతుగా నిలిచారు. కేవలం ముస్లిం అయినందున మాత్రమే షారూక్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం అవివేకమని శివసేన నాయకుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్ అన్నారు. గతంలో పలుసార్లు షారూక్‌పై మండిపడిన శివసేన ప్రస్తుతం బీజేపీ నేతల వ్యాఖ్యలను తప్పు పట్టడమే కాకుండా షారూక్‌కు మద్దతివ్వడం, ఆయనపై ఆరోపణలకు శివసేన సమాధానం చెప్పడం విశేషం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా షారూక్‌కు బాసటగా నిలిచారు. షారూక్‌ వ్యాఖ్యలతోనైనా పరిస్థితి చక్కబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నివర్గాలను ‘అసహనానికి’ గురి చేయడం ద్వారా బీజేపీ ఏం సాధించదలచుకుందని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా షారూక్‌ వ్యాఖ్యలకు మద్దతు తెలిపింది. అందరూ చెడ్డవాళ్ళంటూ విమర్శలు దిగే బీజేపీ ఒక్కటే మంచిదా అని తృణమూల్‌ ప్రశ్నించింది.

Tags:    
Advertisement

Similar News