విశాఖ సబ్ రిజిస్ట్రార్‌కు రూ.5 కోట్లకు పైగా ఆస్తులు

విశాఖపట్నం జిల్లాలో ఆరు నెలలుగా సస్పెన్షన్‌లో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ రామకృష్టదాసు ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. విశాఖ, యలమంచిలిలో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు రామకృష్ణదాసుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో 8 బృందాలు పాల్గొన్నాయి. యలమంచిలిలో ఇల్లు, ఏటికొప్పాకలో 4 ఎకరాల భూమి, దార్లపూడిలో 3.2 ఎకరాలు, 3 బ్యాంకు లాకర్లను గుర్తించారు. రామకృష్టదాసు అక్కయ్యపాలెం సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేసి సస్పెండయ్యారు. ప్రభుత్వానికి రావాల్సిన రెండు కోట్ల […]

Advertisement
Update: 2015-11-02 19:02 GMT

విశాఖపట్నం జిల్లాలో ఆరు నెలలుగా సస్పెన్షన్‌లో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ రామకృష్టదాసు ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. విశాఖ, యలమంచిలిలో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు రామకృష్ణదాసుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో 8 బృందాలు పాల్గొన్నాయి. యలమంచిలిలో ఇల్లు, ఏటికొప్పాకలో 4 ఎకరాల భూమి, దార్లపూడిలో 3.2 ఎకరాలు, 3 బ్యాంకు లాకర్లను గుర్తించారు. రామకృష్టదాసు అక్కయ్యపాలెం సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేసి సస్పెండయ్యారు. ప్రభుత్వానికి రావాల్సిన రెండు కోట్ల రూపాయలను తన అధికార దుర్వినియోగంతో రాకుండా చేసినందుకుగాను ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు.

Tags:    
Advertisement

Similar News