'అసహనం'పై సోనియా ఫిర్యాదు-మోదీ ధ్వజం

ఓవైపు బీజేపీ ప్రభుత్వ ‘అసహనం’పై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెళ్ళగా… చేసిన తప్పు తెలుసుకోకుండా ఎదుటివాళ్ళపై రాళ్ళు వేస్తారా అంటూ ధ్వజమెత్తారు. సోనియా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసిన కొంత సేపటికే మోదీ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌ వ్యవహారశైలి గురివింద తన కింద ఉన్న నలుపు తెలుసుకోకుండా ఎదుటివారికి పేర్లు పెట్టినట్టుందని ఆయన దుయ్యబట్టారు. 1984లో సిక్కుల ఊచకోతకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీ ‘అసహనం’పై మాట్లాడడం విడ్డూరంగా ఉందని మోదీ ఆక్షేపించారు. […]

Advertisement
Update: 2015-11-02 10:58 GMT

ఓవైపు బీజేపీ ప్రభుత్వ ‘అసహనం’పై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెళ్ళగా… చేసిన తప్పు తెలుసుకోకుండా ఎదుటివాళ్ళపై రాళ్ళు వేస్తారా అంటూ ధ్వజమెత్తారు. సోనియా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసిన కొంత సేపటికే మోదీ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌ వ్యవహారశైలి గురివింద తన కింద ఉన్న నలుపు తెలుసుకోకుండా ఎదుటివారికి పేర్లు పెట్టినట్టుందని ఆయన దుయ్యబట్టారు. 1984లో సిక్కుల ఊచకోతకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీ ‘అసహనం’పై మాట్లాడడం విడ్డూరంగా ఉందని మోదీ ఆక్షేపించారు. భారతీయ జనతాపార్టీ అధికారం చేపట్టిన తర్వాత పరమత సహనం లోపిస్తోందని, ‘అసహనం’ పెరిగిపోతోందని ఆమె రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఎదురుదాడికి దిగారు. తనను కలిసిన సోనియాగాంధీతో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 40 నిమషాలపాటు మాట్లాడారు. మంగళవారం మరోసారి పార్లమెంటుసభ్యుల బృందంతో ఆమె రాష్ట్రపతిని కలిసి బీజేపీ ప్రభుత్వ ‘అసహనానికి’ సంబంధించిన వివరాలు సోదాహరణగా తెలపనున్నట్టు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రజలు ఎలాంటి భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నారో తెలిపే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News