ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

చదువులో ఎక్కడ వెనుకబడి పోతానోనన్న ఒత్తిడి మరో నిండు ప్రాణాన్ని బలిగొనే ప్రయత్నం చేసింది. మెడిసిన్‌ చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. ఎంబీబీఎస్‌ తొలి సంవత్సరం చదువుతున్న విద్యార్థి జయసాయి కృష్ణ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన కడపలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌)లో జరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన జయసాయికృష్ణ రిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చదవడానికి ఈ సంవత్సరమే చేరాడు. ఉదయం 7.20 సమయంలో కళాశాల హాస్టల్‌లోని తన […]

Advertisement
Update: 2015-10-26 16:02 GMT

చదువులో ఎక్కడ వెనుకబడి పోతానోనన్న ఒత్తిడి మరో నిండు ప్రాణాన్ని బలిగొనే ప్రయత్నం చేసింది. మెడిసిన్‌ చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. ఎంబీబీఎస్‌ తొలి సంవత్సరం చదువుతున్న విద్యార్థి జయసాయి కృష్ణ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన కడపలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌)లో జరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన జయసాయికృష్ణ రిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చదవడానికి ఈ సంవత్సరమే చేరాడు. ఉదయం 7.20 సమయంలో కళాశాల హాస్టల్‌లోని తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. తోటి విద్యార్థులు సకాలంలో అతని ప్రయత్నాన్ని గుర్తించి ఉరి తాడు నుంచి బయటకు తీశారు. అప్పటికే ఊపిరాడక ఇబ్బంది పడుతున్న అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News