విజయవాడ స్టేషన్‌లో రూ. 5 కోట్ల బంగారం పట్టివేత

గరిష్ట స్థాయిలో బంగారం పట్టివేత ఇప్పటివరకు కేవలం అంతర్జాతీయ విమానాశ్రయాలకే పరిమితమైంది. ఇపుడు రైల్వే స్టేషన్లకు కూడా విస్తరించినట్టుంది. అడపాదడపా రైల్వే స్టేషన్లలో బంగారం దొరుకుతున్నా ఇంత పెద్ద మొత్తంలో దొరకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ దొరికిన బంగారం ఎంతో తెలుసా? 20 కిలోలు. విలువ దాదాపు ఐదు కోట్ల రూపాయలు. వ్యాపారులు ఈ బంగారాన్ని హైదరాబాద్ నుంచి చెన్నై తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. బంగారానికి సంబంధించి ఎటువంటి బిల్లులు లేకపోవడంతో వ్యాపారులను పోలీసులు […]

Advertisement
Update: 2015-10-25 22:06 GMT

గరిష్ట స్థాయిలో బంగారం పట్టివేత ఇప్పటివరకు కేవలం అంతర్జాతీయ విమానాశ్రయాలకే పరిమితమైంది. ఇపుడు రైల్వే స్టేషన్లకు కూడా విస్తరించినట్టుంది. అడపాదడపా రైల్వే స్టేషన్లలో బంగారం దొరుకుతున్నా ఇంత పెద్ద మొత్తంలో దొరకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ దొరికిన బంగారం ఎంతో తెలుసా? 20 కిలోలు. విలువ దాదాపు ఐదు కోట్ల రూపాయలు. వ్యాపారులు ఈ బంగారాన్ని హైదరాబాద్ నుంచి చెన్నై తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. బంగారానికి సంబంధించి ఎటువంటి బిల్లులు లేకపోవడంతో వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బంగారాన్ని అక్రమంగా తరలించడం లేదని, దాని బిల్లులు హైదరాబాద్‌లో ఉన్నాయని వ్యాపారులు మూల్‌చంద్, నిర్మల్ పోలీసులకు తెలిపారు. వెంటనే వాటిని తీసుకురావాలని కోరడంతో వారు హైదరాబాద్ బయలుదేరారు.

Tags:    
Advertisement

Similar News