బయ్యారం అటవీప్రాంతంలో ఎదురు కాల్పులు

ఖమ్మం జిల్లాలోని న్యూడెమోక్రసీ అశోక్ దళానికి, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బయ్యారం మండలం కంబాలపల్లి అటవీ ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. న్యూ డెమోక్రసీ సభ్యులు సమావేశమవుతున్నారని తెలుసుకున్న పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సమయంలో పోలీసులకు దళ సభ్యులు ఎదురు పడటంతో కాల్పులు జరిగాయి. సుమారు 10 నిమిషాలపాటు కాల్పులు కొనసాగాయి. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ సందర్భంగా ఇద్దరు దళ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు […]

Advertisement
Update: 2015-10-23 16:04 GMT

ఖమ్మం జిల్లాలోని న్యూడెమోక్రసీ అశోక్ దళానికి, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బయ్యారం మండలం కంబాలపల్లి అటవీ ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. న్యూ డెమోక్రసీ సభ్యులు సమావేశమవుతున్నారని తెలుసుకున్న పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సమయంలో పోలీసులకు దళ సభ్యులు ఎదురు పడటంతో కాల్పులు జరిగాయి. సుమారు 10 నిమిషాలపాటు కాల్పులు కొనసాగాయి. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ సందర్భంగా ఇద్దరు దళ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News