కన్నుమూసిన కళ్లు చిదంబరం

ప్రముఖ హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూశారు. కొద్దికాలంగా శ్వాససంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరు చిదంబరం, కళ్లు చిత్రంలో అద్భుత నటన ద్వారా ఆయనకు కళ్లు చిదంబరంగా పేరొచ్చింది. చిదంబరం 300లకు పైగా చిత్రాల్లో నటించారు. కొండవీటి దొంగ, గోవిందా గోవిందా, అమ్మోరు, చంటి, మనీ, పెళ్లిపందిరి, గంగపుత్రులు వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి స్పందన వచ్చింది. […]

Advertisement
Update: 2015-10-19 00:11 GMT

ప్రముఖ హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూశారు. కొద్దికాలంగా శ్వాససంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరు చిదంబరం, కళ్లు చిత్రంలో అద్భుత నటన ద్వారా ఆయనకు కళ్లు చిదంబరంగా పేరొచ్చింది. చిదంబరం 300లకు పైగా చిత్రాల్లో నటించారు. కొండవీటి దొంగ, గోవిందా గోవిందా, అమ్మోరు, చంటి, మనీ, పెళ్లిపందిరి, గంగపుత్రులు వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి స్పందన వచ్చింది. కళ్లు చిదంబరానికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. గతంలో ఆయన విశాఖ పోర్టులో ఉద్యోగిగా పనిచేశారు. చిదంబరం ఆఖరి చిత్రం శ్రీసాయి సంకల్పం.

కళ్లు చిదంబరం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను సంప్రదించినా ఎలాంటి సాయం అందలేదు. దీంతో చేసిది లేక ఆయన హైదరాబాద్ విడిచి విశాఖ వెళ్లిపోయారని చెబుతుంటారు. 300లకు పైగా చిత్రాల్లో నటించినప్పటికీ చివరకు నిరుపేదగానే మరణించారని ఆయన సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు.

Tags:    
Advertisement

Similar News