చరణ్‌పైకి వర్మ లేడి "బ్రూస్‌ లీ"

ట్విట్టర్‌ ద్వారా పక్కవాళ్ల పనిపట్టడమే పనిగా పెట్టుకున్న రామ్‌గోపాల్ వర్మ… మెగా ఫ్యామిలీపై దండయాత్ర కొనసాగిస్తున్నారు. నిన్నటి వరకు పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ను పదేపదే గెలికి ఫోటోకు దండేయించుకున్న వర్మ ఇప్పుడు రామ్‌చరణ్‌పై పడ్డారు. చరణ్‌ ”బ్రూస్‌లీ” విడుదలకు సిద్దమైన వేళ …పోటీగా ”రామ్‌గోపాల్ వర్మాస్ బ్రూస్ లీ” వర్కవుట్ సాంగ్ అంటూ ట్విట్టర్‌లో ఏకంగా ఒక పాటను విడుదల చేశారు. బుధవారం ఉదయమే సాయంత్రం తన ”బ్రూస్ లీ” పాట విడుదల చేస్తానంటూ ప్రకటించి మరీ […]

Advertisement
Update: 2015-10-14 09:37 GMT

ట్విట్టర్‌ ద్వారా పక్కవాళ్ల పనిపట్టడమే పనిగా పెట్టుకున్న రామ్‌గోపాల్ వర్మ… మెగా ఫ్యామిలీపై దండయాత్ర కొనసాగిస్తున్నారు. నిన్నటి వరకు పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ను పదేపదే గెలికి ఫోటోకు దండేయించుకున్న వర్మ ఇప్పుడు రామ్‌చరణ్‌పై పడ్డారు. చరణ్‌ ”బ్రూస్‌లీ” విడుదలకు సిద్దమైన వేళ …పోటీగా ”రామ్‌గోపాల్ వర్మాస్ బ్రూస్ లీ” వర్కవుట్ సాంగ్ అంటూ ట్విట్టర్‌లో ఏకంగా ఒక పాటను విడుదల చేశారు. బుధవారం ఉదయమే సాయంత్రం తన ”బ్రూస్ లీ” పాట విడుదల చేస్తానంటూ ప్రకటించి మరీ అన్నంత పనిచేశారు.

తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పాటను విడుదల చేశారు. ”దమ్ముంది.. తెగింపు ఉంది…ఇంకా నీకేం కావాలీ” అంటూ సాగే పాటలో ఓ అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనిపిస్తోంది. అయితే చరణ్ బ్రూస్ లీ విడుదల సమయంలో వర్మ ఇలా బ్రూస్ లీ పేరుతో పాటను విడుదల చేయడంపై మెగా అభిమానులు రగిలిపోతున్నారు. అయితే వర్మతో పెట్టుకుని ఫ్రీ పబ్లిసిటీ కల్పించడం కన్నా సైలెంట్‌గా ఉండడమే బెటరని వారు భావిస్తున్నారట. వర్మ మాత్రం కావాలనే… వివాదం కోసం, మెగా ఫ్యాన్స్‌ను గిల్లడం కోసం, ఫ్రీ పబ్లిసిటీ కోసమే ”వర్మాస్ బ్రూస్ లీ” అంటూ ఈ సమయంలో పాటను విడుదల చేశారని భావిస్తున్నారు. వర్మ లేపిన టైటిల్ వివాదంపై చిత్ర యూనిట్ స్పందిస్తుందే లేదో చూడాలి.

Full View

Tags:    
Advertisement

Similar News