జగన్ దీక్షాస్థలి వద్ద ఉద్రిక్తత

ఆరు రోజులుగా ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ తో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈ విషయం తెలసుకున్న వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి హుటాహుటిన నల్లపాడు లోని దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. జగన్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు జగన్ ఆరోగ్యపరిస్థితిని మీడియాలో తెలుసుకున్న అభిమానులు పలు ప్రాంతాల్లో ఆత్మహత్యాయత్నం చేశారు. అటు గుంటూరులోని నల్లపాడు దీక్ష ప్రాంగణం వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీక్షా స్థలం […]

Advertisement
Update: 2015-10-12 08:05 GMT
ఆరు రోజులుగా ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ తో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈ విషయం తెలసుకున్న వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి హుటాహుటిన నల్లపాడు లోని దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. జగన్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు జగన్ ఆరోగ్యపరిస్థితిని మీడియాలో తెలుసుకున్న అభిమానులు పలు ప్రాంతాల్లో ఆత్మహత్యాయత్నం చేశారు.
అటు గుంటూరులోని నల్లపాడు దీక్ష ప్రాంగణం వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీక్షా స్థలం వద్ద ఓ యువకుడు బాటిల్ తెచ్చుకున్న పెట్రోలో పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు యత్నించాడు.

వెంటనే ఈ విషయాన్ని గమనించిన వైసీపీ నాయకులు, పోలీసులు అతన్ని అడ్డుకుని పెట్రోల్ బాటిల్ ను లాక్కున్నారు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
Tags:    
Advertisement

Similar News