టీఎంసీ, బీజేపీ మధ్య బాంబుల యుద్ధం

తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నాటు బాంబులు వేసుకునే దాకా వచ్చింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య చెలరేగిన తోపులాట క్రమంగా కొటుకునేదాకా వచ్చింది. ఈ క్రమంలో రాళ్ళు రువ్వుకుంటూ ముష్టిఘాతాలతో తలపడ్డారు. అనంతరం ఇంకా రెచ్చిపోయిన ఇరుపక్షాల కార్యకర్తలు బాంబులు కూడా వేసుకున్నారు. వారిని అదుపు చేయడం పోలీసులకు చాలా కష్టమైంది. అయితే లాఠీఛార్జితో పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వారి వల్ల […]

Advertisement
Update: 2015-10-09 15:07 GMT

తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నాటు బాంబులు వేసుకునే దాకా వచ్చింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య చెలరేగిన తోపులాట క్రమంగా కొటుకునేదాకా వచ్చింది. ఈ క్రమంలో రాళ్ళు రువ్వుకుంటూ ముష్టిఘాతాలతో తలపడ్డారు. అనంతరం ఇంకా రెచ్చిపోయిన ఇరుపక్షాల కార్యకర్తలు బాంబులు కూడా వేసుకున్నారు. వారిని అదుపు చేయడం పోలీసులకు చాలా కష్టమైంది. అయితే లాఠీఛార్జితో పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వారి వల్ల కాలేదు. దీంతో రెండు రౌండ్లు కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. పశ్చిమబెంగాల్ ఉత్తర దిరాజ్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలకు గాయాలయ్యాయి. కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News