రఘువీరారెడ్డిపై టీడిపి మళ్ళీ దాడి...

పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై మరోసారి దాడికి టీడీపీ కార్యకర్తలు తెగబడ్డారు. ఏకంగా రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. కుప్పం విమానాశ్రయానికి భూములిచ్చేందుకు రైతులు వ్యతిరేకిస్తుండడంతో వారికి సంఘీభావంగా రఘవీరారెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించారు. రఘువీరారెడ్డి రాకను జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రఘువీరా కాన్వాయ్‌పై చెప్పులు విసిరారు, రాళ్లు వర్షం కురిపించారు. దాడితో రఘువీరా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ ఎస్‌ఐకు గాయాలయ్యాయి. ఈ […]

Advertisement
Update: 2015-10-05 04:21 GMT

పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై మరోసారి దాడికి టీడీపీ కార్యకర్తలు తెగబడ్డారు. ఏకంగా రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. కుప్పం విమానాశ్రయానికి భూములిచ్చేందుకు రైతులు వ్యతిరేకిస్తుండడంతో వారికి సంఘీభావంగా రఘవీరారెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించారు.

రఘువీరారెడ్డి రాకను జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రఘువీరా కాన్వాయ్‌పై చెప్పులు విసిరారు, రాళ్లు వర్షం కురిపించారు. దాడితో రఘువీరా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ ఎస్‌ఐకు గాయాలయ్యాయి. ఈ సమయంలో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది.

కుప్పుంలో రఘువీరారెడ్డి సభకు పోలీసులు అనుమతివ్వలేదు. భారీగా పోలీసులు మోహరించారు. రఘవీరారెడ్డి వెంట వెళ్తున్న దాదాపు వంద మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల మచిలీపట్నం పోర్టు బాధితులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన సమయంలోనూ టీడీపీ సానుభూతిపరులు రఘువీరారెడ్డిపై మట్టి పెళ్లలతో దాడి చేశారు.

Tags:    
Advertisement

Similar News