పచ్చదనం కోసం యువత పరితపన

బెంగుళూరు యువత హరితదనంపై దృష్టి సారించింది. సెలవు రోజుల్లో, తీరిక వేళల్లో కాలక్షేపం కోసం కబుర్లు చెప్పడం మానేసి కార్యాచరణకు పూనుకుంది. సెలవు రోజు వచ్చిందన్నా… వీకెండ్‌ వస్తుందన్నా వీరి ఆలోచనలన్నీ పచ్చదనంపై పరుచుకుంటున్నాయి. ఒకప్పుడు సందర్భోచితంగా చేసే ఈ పనిని ఇపుడు నిత్యకృత్యంగా మార్చుకున్నాయి. కొంతమంది స్వచ్చంద సంస్థలకెళ్లి సేవలు అందిస్తుంటే మరికొంతమంది మొక్కలు నాటడంలో నిమగ్నమవుతున్నారు. నగర విస్తరణ, అబివృద్ది పేరుతో వేలాది చెట్లు నరికేస్తున్న అధికారులు పచ్చదనంపై దృష్టి పెట్టలేక పోతుండడం గమనించిన […]

Advertisement
Update: 2015-10-02 00:07 GMT

బెంగుళూరు యువత హరితదనంపై దృష్టి సారించింది. సెలవు రోజుల్లో, తీరిక వేళల్లో కాలక్షేపం కోసం కబుర్లు చెప్పడం మానేసి కార్యాచరణకు పూనుకుంది. సెలవు రోజు వచ్చిందన్నా… వీకెండ్‌ వస్తుందన్నా వీరి ఆలోచనలన్నీ పచ్చదనంపై పరుచుకుంటున్నాయి. ఒకప్పుడు సందర్భోచితంగా చేసే ఈ పనిని ఇపుడు నిత్యకృత్యంగా మార్చుకున్నాయి. కొంతమంది స్వచ్చంద సంస్థలకెళ్లి సేవలు అందిస్తుంటే మరికొంతమంది మొక్కలు నాటడంలో నిమగ్నమవుతున్నారు. నగర విస్తరణ, అబివృద్ది పేరుతో వేలాది చెట్లు నరికేస్తున్న అధికారులు పచ్చదనంపై దృష్టి పెట్టలేక పోతుండడం గమనించిన యువత ఆ ప్రయత్నంలో వారు నిమగ్నమవుతున్నారు. ఈ విషయంపై ప్రజల్లో చైతన్యాన్ని కూడా రగిలిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వన మహోత్సవాల్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రహదారులకు ఇరువైపులా, ట్రాఫిక్‌ ఐలండ్‌ల వద్ద, చెరువు గట్ల మీద వీరు హరిత హారాలపై దృష్టి పెట్టారు. వెయ్యి చెరువు గట్లను లక్ష్యం చేసుకుని మొక్కల్ని నాటే కార్యక్రమం చేపట్టారు. దీనికి గాంధీ జయంతిని ప్రారంభ వేడుకగా నిర్ణయించారు. అక్టోబర్‌ 2వ తేదీనే కనీసం వెయ్యి చెరువుల చుట్టూ హరిత హారాలు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పని ప్రారంభించారు. మిగిలిన వారికి కూడా హరిత హారాల నిర్మాణంలో స్ఫూర్తిగా నిలవాలని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News