పాలకుర్తిలోఎర్రబెల్లి అరెస్ట్‌

తెలంగాణ శాసనసభలో తెలంగాణ టిడిపి పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలకుర్తి వద్ద మార్కెట్ యార్డులోని ఒక భవనంలో నిర్మించిన గదుల ప్రారంభోత్సవంలో టీడీపి, టిఆర్ఎస్ కార్యకర్తల మద్య ఘర్షణ చెలరేగింది.ఈ సందర్భంగా రెండు పార్టీల వారు రాళ్త దాడి చేసుకున్నారు. పరస్పరం దూషణలకు దిగారు. ఈ ఘటనలో పదిహేను మంది గాయపడినట్టు తెలిసింది. వరంగల్‌ జిల్లాలోని మార్కెట్ యార్డులో అదనపు గదుల ప్రారంభోత్సవానికి ఎర్రబెల్లి దయాకరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ […]

Advertisement
Update: 2015-09-27 05:42 GMT
తెలంగాణ శాసనసభలో తెలంగాణ టిడిపి పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలకుర్తి వద్ద మార్కెట్ యార్డులోని ఒక భవనంలో నిర్మించిన గదుల ప్రారంభోత్సవంలో టీడీపి, టిఆర్ఎస్ కార్యకర్తల మద్య ఘర్షణ చెలరేగింది.ఈ సందర్భంగా రెండు పార్టీల వారు రాళ్త దాడి చేసుకున్నారు. పరస్పరం దూషణలకు దిగారు. ఈ ఘటనలో పదిహేను మంది గాయపడినట్టు తెలిసింది. వరంగల్‌ జిల్లాలోని మార్కెట్ యార్డులో అదనపు గదుల ప్రారంభోత్సవానికి ఎర్రబెల్లి దయాకరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎర్రబెల్లిని అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఎర్రబెల్లి దయాకరరావుతో పాటు అక్కడ ఉన్న పోలీసులకు, మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జీ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డవారిలో పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కూడా ఉన్నారని చెబుతున్నారు. ఉద్రిక్తతను తగ్గించేందుకుగాను దయాకరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. కాగా, టీఆర్ఎస్ దాడిని నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Tags:    
Advertisement

Similar News