విచార‌ణ‌కు స‌హ‌క‌రించండి: సౌదీ దౌత్య కార్యాల‌యానికి విన‌తి

ఢిల్లీలోని శివారులో ఇటీవ‌ల వెలుగుచూసిన ఇద్ద‌రు నేపాలీ యువ‌తుల నిర్బంధం,  రేప్ కేసు విష‌యంలో స‌హ‌క‌రించాల‌ని భార‌త విదేశీ వ్య‌వ‌హారాల శాఖ సౌదీ అరేబియా దౌత్య‌కార్యాల‌యానికి విజ్ఞ‌ప్తి చేసింది. ఢిల్లీ శివారులోని ఓ ఖరీదైన ఫ్లాట్‌లో రెండు నెల‌లుగా ఇద్దరు నేపాలీ యువ‌తులను బంధించి వారిపై సౌదీ దౌత్య‌వేత్త‌, అత‌ని స్నేహితులు  దారుణాలకు పాల్పడుతున్నారన్న స‌మాచారంతో గుర్గావ్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. బాధిత మహిళల ఫిర్యాదుతో సౌదీ దౌత్యవేత్త, ఆయన స్నేహితులపై అత్యాచారం కేసులు […]

Advertisement
Update: 2015-09-11 01:22 GMT
ఢిల్లీలోని శివారులో ఇటీవ‌ల వెలుగుచూసిన ఇద్ద‌రు నేపాలీ యువ‌తుల నిర్బంధం, రేప్ కేసు విష‌యంలో స‌హ‌క‌రించాల‌ని భార‌త విదేశీ వ్య‌వ‌హారాల శాఖ సౌదీ అరేబియా దౌత్య‌కార్యాల‌యానికి విజ్ఞ‌ప్తి చేసింది. ఢిల్లీ శివారులోని ఓ ఖరీదైన ఫ్లాట్‌లో రెండు నెల‌లుగా ఇద్దరు నేపాలీ యువ‌తులను బంధించి వారిపై సౌదీ దౌత్య‌వేత్త‌, అత‌ని స్నేహితులు దారుణాలకు పాల్పడుతున్నారన్న స‌మాచారంతో గుర్గావ్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. బాధిత మహిళల ఫిర్యాదుతో సౌదీ దౌత్యవేత్త, ఆయన స్నేహితులపై అత్యాచారం కేసులు నమోదు చేసిన విష‌యం తెలిసిందే! దీన్ని సౌదీ దౌత్య‌కార్యాల‌యం ఖండించింది. ఈ కేసులో హ‌ర్యానా పోలీసుల‌ విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని భార‌త విదేశీ వ్య‌వ‌హారాల శాఖ అధికార ప్ర‌తినిధి వికాస్ స్వ‌రూప్‌, సౌదీ దౌత్య‌వేత్త సౌద్ మ‌హ‌మ్మ‌ద్ అల్సాతీని కోరారు. గురువారం గుర్గావ్ పోలీసులు ఘ‌ట‌న‌పై విదేశీ వ్య‌వ‌హారాల శాఖ‌కు పూర్తి నివేదిక అంద‌జేసింది. బాధిత యువ‌తులపై లైంగిక దాడి జరిగింద‌ని ఆసుప‌త్రి ప‌రీక్ష‌ల్లో నిర్ధార‌ణ అయింది. ఇప్ప‌టికీ సౌదీ కార్యాల‌యం దీన్ని ఖండిస్తోంది. హ‌ర్యానా పోలీసులు దౌత్య నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని, ఇంట్లోకి అనుమ‌తి లేకుండా వ‌చ్చి దాడి చేశార‌ని ఆరోపిస్తోంది. మరోవైపు ఈ కేసుపై పూర్తి దర్యాప్తు జరిపించాలని నేపాల్ రాయబార కార్యాలయం భారత్‌ను కోరుతోంది. మ‌హిళా సంఘాలు ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించాయి. దోషులు ఎంత‌టివారైనా వ‌ద‌ల కూడ‌ద‌ని డిమాండ్ చేస్తూ ప‌లు చోట్ల నిర‌స‌న‌లు చేప‌డుతున్నాయి.
Tags:    
Advertisement

Similar News