చిరు కోసం తమన్ కష్టాలు

రామ్ చరణ్ సినిమాలో చిరంజీవి కీలక పాత్ర పోషిస్తున్నాడనేది పాత విషయమే. అయితే అదే చిరంజీవి కోసం ఇప్పుడు మ్యూజిక్ డైరక్టర్ తమన్ అష్టకష్టాలు పడుతున్నాడనేది కొత్త విషయం. అవును.. చిరంజీవికి సంగీత దర్శకత్వం వహించడమంటే ఆషామాషీ విషయం కాదు. బ్రూస్ లీతో అలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్నాడు తమన్. ఈ సినిమాలో చిరంజీవిపై ఓ సాంగ్ ఉంది. ఆ సాంగ్ కంపోజిషన్ కోసం తెగ కష్టపడుతున్నాడు. సినిమా కథలో భాగంగా చిరంజీవి, ఇలియానా మధ్య వచ్చే […]

Advertisement
Update: 2015-09-09 19:00 GMT
రామ్ చరణ్ సినిమాలో చిరంజీవి కీలక పాత్ర పోషిస్తున్నాడనేది పాత విషయమే. అయితే అదే చిరంజీవి కోసం ఇప్పుడు మ్యూజిక్ డైరక్టర్ తమన్ అష్టకష్టాలు పడుతున్నాడనేది కొత్త విషయం. అవును.. చిరంజీవికి సంగీత దర్శకత్వం వహించడమంటే ఆషామాషీ విషయం కాదు. బ్రూస్ లీతో అలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్నాడు తమన్. ఈ సినిమాలో చిరంజీవిపై ఓ సాంగ్ ఉంది. ఆ సాంగ్ కంపోజిషన్ కోసం తెగ కష్టపడుతున్నాడు. సినిమా కథలో భాగంగా చిరంజీవి, ఇలియానా మధ్య వచ్చే ఈ సాంగ్ కోసం.. ఏడెనిమిది వెర్షన్లు సిద్ధం చేసుకున్నాడు తమన్. ఫైనల్ గా చిరంజీవి స్టుడియోకు వచ్చి వాటిలో ఒకటి సెలక్ట్ చేయడంతో ఊపిరిపీల్చుకున్నాడు. ఈ విషయాన్ని తమన్ స్వయంగా వెల్లడించాడు. త్వరలోనే ఆడియో రిలీడ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేస్తానని ప్రకటించాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చేనెల 16న విడుదల చేయాలనుకుంటున్నారు. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.
Tags:    
Advertisement

Similar News