పెళ్లి వాయిదా వేసుకున్న ప్రియమణి

అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న ప్రియమణి పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోతానని గతంలోనే ప్రకటించింది. ముంబయికి చెందిన ముస్తాఫా రాజా అనే వ్యక్తితో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నానని ప్రకటించింది ప్రియమణి. అతడితో పెళ్లికి ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చింది. కానీ ఇంతలోనే తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నానని కూడా బ్రేకింగ్ న్యూస్ బయటపెట్టింది. సినిమా ఛాన్సులు కూడా లేని ప్రియమణి ఎందుకు పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుందా అని అంతా తెగ ఆలోచించారు. దీనికి ప్రియమణి […]

Advertisement
Update: 2015-09-09 19:03 GMT
అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న ప్రియమణి పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోతానని గతంలోనే ప్రకటించింది. ముంబయికి చెందిన ముస్తాఫా రాజా అనే వ్యక్తితో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నానని ప్రకటించింది ప్రియమణి. అతడితో పెళ్లికి ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చింది. కానీ ఇంతలోనే తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నానని కూడా బ్రేకింగ్ న్యూస్ బయటపెట్టింది. సినిమా ఛాన్సులు కూడా లేని ప్రియమణి ఎందుకు పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుందా అని అంతా తెగ ఆలోచించారు. దీనికి ప్రియమణి చెప్పిన సమాధానం జాతకం. అవును.. ప్రస్తుతం ప్రియమణి జాతకం సరిగ్గా లేదట. ఇలాంటి టైమ్ లో పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో కష్టాలు తప్పవని ఎవరో హెచ్చరించారట. అందుకే ప్రియుడు ముస్తాఫా రాజాతో చర్చించి మరీ పెళ్లిని కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకుంది ప్రియమణి. సో.. ఈ బ్యూటీ మరికొన్నాళ్ల పాటు తన డేటింగ్ లైఫ్ ను కొనసాగించనుందన్నమాట.
Tags:    
Advertisement

Similar News