మరుగుదొడ్డి నిర్మాణం కోసం మేకల అమ్మివేత

ప్రతీ కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకోవాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తూ నిర్విరామంగా ఆ దిశగా కృషి చేస్తున్న విషయం విదితమే. ఆరు బయట మలవిసర్జన మంచిది కాదని ప్రచారం చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో ధమత్రి జిల్లా కోటభర్రి గ్రామంలో 102 ఏళ్ల వృద్ధురాలు మరుగుదొడ్డి నిర్మాణం కోసం తన మేకలను అమ్మింది. మేకలను అమ్మగా వచ్చిన రూ. 22 వేలతో మరుగుదొడ్డి నిర్మించుకుంది. మలవిసర్జన బయట చేయడం వలన వ్యాధులు వస్తున్నాయని వృద్ధురాలు తెలిపింది. ఈ […]

Advertisement
Update: 2015-09-05 23:07 GMT
ప్రతీ కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకోవాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తూ నిర్విరామంగా ఆ దిశగా కృషి చేస్తున్న విషయం విదితమే. ఆరు బయట మలవిసర్జన మంచిది కాదని ప్రచారం చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో ధమత్రి జిల్లా కోటభర్రి గ్రామంలో 102 ఏళ్ల వృద్ధురాలు మరుగుదొడ్డి నిర్మాణం కోసం తన మేకలను అమ్మింది. మేకలను అమ్మగా వచ్చిన రూ. 22 వేలతో మరుగుదొడ్డి నిర్మించుకుంది. మలవిసర్జన బయట చేయడం వలన వ్యాధులు వస్తున్నాయని వృద్ధురాలు తెలిపింది. ఈ క్రమంలోనే ఇంటి వద్దనే మరుగుదొడ్డి నిర్మించుకున్నాని చెప్పింది. ఇక గ్రామంలో మొత్తం 450 కుటుంబాలు ఉన్నాయి. ప్రతీ ఒక్కరు మరుగుదొడ్డి నిర్మించుకోవాలని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కూడా సబ్సిడీ అందిస్తోంది.
Tags:    
Advertisement

Similar News