పవన్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్-2ను ఇప్పటికే సెట్స్ పైకి తీసుకొచ్చాడు. దీనికి సర్దార్ గబ్బర్ సింగ్ అనే పేరుకూడా పెట్టాడు. ఆగస్ట్ 15 కానుకగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ కూడా విడుదలయ్యాయి. ఆ స్టిల్స్ ను స్వయంగా పవన్ కల్యాణే తయారుచేశాడనే టాక్ రావడంతో అభిమానులు మరింత పండగ చేసుకున్నారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి ఓ టీజర్ కూడా విడుదల […]

Advertisement
Update: 2015-08-25 19:00 GMT
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్-2ను ఇప్పటికే సెట్స్ పైకి తీసుకొచ్చాడు. దీనికి సర్దార్ గబ్బర్ సింగ్ అనే పేరుకూడా పెట్టాడు. ఆగస్ట్ 15 కానుకగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ కూడా విడుదలయ్యాయి. ఆ స్టిల్స్ ను స్వయంగా పవన్ కల్యాణే తయారుచేశాడనే టాక్ రావడంతో అభిమానులు మరింత పండగ చేసుకున్నారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి ఓ టీజర్ కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మరో వారం రోజుల్లో పవన్ కల్యాణ్ పుట్టినరోజు రాబోతోంది. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే. ఈ వేడుకను పురస్కరించుకొని, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి ఓ మోషన్ పోస్టర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శక-నిర్మాతలు. నిజానికి పవన్ పుట్టినరోజు కానుకగా ఏకంగా ట్రయిలర్ నే విడుదల చేయాలనుకున్నారు. అన్నీ అనుకున్నట్టు షూటింగ్ జరిగితే నిజంగానే ట్రయిలర్ సిద్ధమయ్యేది. కానీ షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో.. బర్త్ డే కు ట్రయిలర్ సిద్ధం కాలేదు. దీంతో మోషన్ పోస్టర్ తోనే సరిపెట్టాలని నిర్ణయించుకున్నారు మేకర్స్.
Tags:    
Advertisement

Similar News