ప్ర‌కాష్ రాజ్ పై కేసు ..!

సెలిబ్రిటీలు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు  చేయ‌డం.  అవి తేడ‌గా వుంటే ప్ర‌జాహిత వాజ్యాలు  దాఖ‌లు చేయ‌డం  ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువైంది.  తాజాగా న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పై కేసు తృటిలో మిస్ అయ్యింది. ప్ర‌కాష్ రాజ్  ఒక బంగారం కంపెనీ  వాణిజ్య ప్ర‌క‌ట‌న లో  న‌టించారు.  వాణిజ్య ప్ర‌క‌ట‌నలో  ప్రకాష్ రాజ్…’every girl who reaches her marrying age is a tension’. అదే ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది. ఈ వాక్యం  ఆడ‌వారిని కించె ప‌రిచెలా […]

Advertisement
Update: 2015-08-17 19:05 GMT

సెలిబ్రిటీలు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం. అవి తేడ‌గా వుంటే ప్ర‌జాహిత వాజ్యాలు దాఖ‌లు చేయ‌డం ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువైంది. తాజాగా న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పై కేసు తృటిలో మిస్ అయ్యింది. ప్ర‌కాష్ రాజ్ ఒక బంగారం కంపెనీ వాణిజ్య ప్ర‌క‌ట‌న లో న‌టించారు. వాణిజ్య ప్ర‌క‌ట‌నలో ప్రకాష్ రాజ్…’every girl who reaches her marrying age is a tension’. అదే ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది. ఈ వాక్యం ఆడ‌వారిని కించె ప‌రిచెలా ఉంద‌ని ఎస్‌.సైఫియాత్‌ అనే మహిళ మ‌ద్రాసు కోర్టులో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అయితే మ‌ద్రాస్ హైకోర్టు ఇది కేవ‌లం ప్ర‌కాష్ రాజ్ ను ఇబ్బంది పెట్ట‌డానికే చేశారు త‌ప్ప‌.. ఇత‌రంగా ఏమి లేద‌ని తేల్చి చెప్పింది.
న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కూడా దీనికి సంబంధించి త‌న సోష‌ల్ నెట్ వ‌ర్క్ ట్విట‌ర్ లో కొన్ని ట్విట్స్ చేశారు. ఆ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో త‌ను ప‌లికిన మాట‌.. ఆడపిల్ల పెళ్లి అంటే త‌ల్లి దండ్రుల‌కు ఒక టెన్ష‌న్ అనే సంద‌ర్భంలో ఉప‌యోగించిన వాక్యం మాత్ర‌మే. ఎవ‌ర్ని కించ ప‌ర‌డానికి కాద‌ని తెలియ చేస్తున్నాను..ద‌య చేసి అదొక ఎక్స్ ప్రెష‌న్ మాత్ర‌మే అని తెలియ చేశారు.

Tags:    
Advertisement

Similar News