విమానాశ్రయంలో కలాంకు ఘన నివాళి

గౌహతి నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాంకు ఘనంగా నివాళులర్పించారు. ఇలా నివాళులర్పించిన వారిలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమిద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడి, ఢిల్లీ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌, ముఖ్యమంత్రి కేజ్రివాల్‌, కేంద్ర రక్షణ మంత్రి పరికర్‌, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, త్రివిధ దళాధిపతులు, పలువురు ప్రముఖులు పాలం విమానాశ్రయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గౌహతి నుంచి ఎయిర్‌ ఫోర్స్‌ ప్రత్యేక విమానంలో వచ్చిన కలాం పార్ధివదేహాన్ని ప్రజల […]

Advertisement
Update: 2015-07-28 02:20 GMT
గౌహతి నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాంకు ఘనంగా నివాళులర్పించారు. ఇలా నివాళులర్పించిన వారిలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమిద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడి, ఢిల్లీ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌, ముఖ్యమంత్రి కేజ్రివాల్‌, కేంద్ర రక్షణ మంత్రి పరికర్‌, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, త్రివిధ దళాధిపతులు, పలువురు ప్రముఖులు పాలం విమానాశ్రయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గౌహతి నుంచి ఎయిర్‌ ఫోర్స్‌ ప్రత్యేక విమానంలో వచ్చిన కలాం పార్ధివదేహాన్ని ప్రజల సందర్శనార్ధం రాజాజీ మార్గ్‌లోని ఆయన నివాసానికి తీసుకువెళ్ళారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం బుధవారం సాయంత్రం 7 గంటల వరకు అక్కడ ఉంచుతారు. రేపు రామేశ్వరం తరలించి గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ పూర్తి లాంఛనాలతో అబ్దుల్‌ కలాం అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి హాజరవుతున్నారు. కాగా కలాం మృతి పట్ల పార్లమెంట్‌ ఉభయ సభలు సంతాపం వ్యక్తం చేశాయి. దేశం ఓ గొప్ప రాజనీతిజ్ఞుడ్ని కోల్పోయిందని, ఒక మేధావి మన మధ్య నుంచి తిరిగిరాని లోకాలకు తరలిపోయారని సభ్యులు వ్యాఖ్యానించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అబ్దుల్‌ కలాం చూపిన ప్రతిభాపాటవాలు మరిచిపోలేనివని, అంతరిక్ష యానంలో ఆయన అడుగులు జాతికి ఎప్పుడూ గుర్తుండి పోతాయని వారు శ్లాఘించారు. బుధవారం పార్లమెంట్‌ ఉభయ సభలకు సెలవు ప్రకటించారు. కేంద్ర కేబినెట్‌ కూడా కలాం మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రులంతా ఆకాంక్షించారు.
Tags:    
Advertisement

Similar News