మళ్లీ తెరపైకి అనూ అగర్వాల్

ఆషికి సినిమాతో సంచలనం సృష్టించిన తార అను అగర్వాల్. ఆ తర్వాత మణిరత్నం తీసిన దొంగ దొంగలో కూడా తన విశ్వరూపం చూపించింది అను. ఆ సినిమా తర్వాత ఆమె స్టార్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అను అగర్వాల్ మాత్రం కోమాలోకి వెళ్లిపోయింది. 1999లో ముంబయిలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అను అగర్వాల్.. చాన్నాళ్ల పాటు మృత్యువుతో పోరాడింది. ఎట్టకేలకు కోమా నుంచి బయటకొచ్చింది. ఎన్నో సర్జరీల తర్వాత అను […]

Advertisement
Update: 2015-07-08 20:02 GMT
ఆషికి సినిమాతో సంచలనం సృష్టించిన తార అను అగర్వాల్. ఆ తర్వాత మణిరత్నం తీసిన దొంగ దొంగలో కూడా తన విశ్వరూపం చూపించింది అను. ఆ సినిమా తర్వాత ఆమె స్టార్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అను అగర్వాల్ మాత్రం కోమాలోకి వెళ్లిపోయింది. 1999లో ముంబయిలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అను అగర్వాల్.. చాన్నాళ్ల పాటు మృత్యువుతో పోరాడింది. ఎట్టకేలకు కోమా నుంచి బయటకొచ్చింది. ఎన్నో సర్జరీల తర్వాత అను ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అప్పటి అనుకు, ఇప్పుటి అనుకు అస్సలు పోలికలుండవు. కానీ టాలెంట్ మాత్రం పోదు కదా. అందుకే.. ఆమె జీవిత ఘటనలతోనే ఆటోబయోగ్రఫీని సినిమాగా తెరకెక్కించింది అను అగర్వాల్. ఆ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. వచ్చే నెలలో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆషికితో రొమాంటిక్ క్వీన్ గా అలరించిన అను అగర్వాల్ ను మరోసారి తెరపై చూసేందుకు బాలీవుడ్ జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News