అల్లూరి కంటే బాహుబలే బెస్ట్

బాహుబలి సినిమా కథ ఎలా పుట్టింది..ఆ సినిమాను ప్రభాస్ ఎందుకు ఒప్పుకున్నాడు.. మూడేళ్ల కాల్షీట్లు ఎందుకు కేటాయించాడు.. ఇలాంటి ఎన్నో సందేహాలకు ఇప్పటికే బాహుబలి టీం సమాధానం ఇచ్చేసింది. అయితే వీటన్నింటి కంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒకటి ప్రభాస్ చెప్పుకొచ్చాడు. బాహుబలి సినిమా కోసం శ్రీకృష్ణదేవరాయలు, అల్లూరి సీతారామరాజు కథల్ని సైతం పక్కనపెట్టానని ప్రకటించాడు యంగ్ రెబల్ స్టార్.  ఓ భారీ బడ్జెట్ సినిమా చేద్దామనుకున్న టైమ్ లో ప్రభాస్ కు 4-5 కథలు వినిపించాడు రాజమౌళి. […]

Advertisement
Update: 2015-07-06 06:00 GMT
బాహుబలి సినిమా కథ ఎలా పుట్టింది..ఆ సినిమాను ప్రభాస్ ఎందుకు ఒప్పుకున్నాడు.. మూడేళ్ల కాల్షీట్లు ఎందుకు కేటాయించాడు.. ఇలాంటి ఎన్నో సందేహాలకు ఇప్పటికే బాహుబలి టీం సమాధానం ఇచ్చేసింది. అయితే వీటన్నింటి కంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒకటి ప్రభాస్ చెప్పుకొచ్చాడు. బాహుబలి సినిమా కోసం శ్రీకృష్ణదేవరాయలు, అల్లూరి సీతారామరాజు కథల్ని సైతం పక్కనపెట్టానని ప్రకటించాడు యంగ్ రెబల్ స్టార్.
ఓ భారీ బడ్జెట్ సినిమా చేద్దామనుకున్న టైమ్ లో ప్రభాస్ కు 4-5 కథలు వినిపించాడు రాజమౌళి. వాటిలో శ్రీకృష్ణదేవరాయలకు చెందిన కథతో పాటు అల్లూరి సీతారామరాజు కథ కూడా ఉంది. వీటితో పాటు మరికొన్ని రాజుల కథలు కూడా ఉన్నాయి. అలా 5 కథలపై దాదాపు నెల రోజుల పాటు మథనపడ్డారు రాజమౌళి-ప్రభాస్. ఫైనల్ గా బాహుబలి కథను తెరకెక్కిద్దామని ప్రభాసే కోరడంతో రాజమౌళి ఓకే అనేశాడు. అలా అల్లూరిని, శ్రీకృష్ణ దేవరాయల్ని కాదని బాహుబలి తెరపైకొచ్చాడు.
Tags:    
Advertisement

Similar News