అనుష్క బాటలో అతిలోక సుందరి

ఒకప్పుడు అతిలోకసుందరి శ్రీదేవి నటనకు పెట్టింది పేరైతే.. ఇప్పుడు అనుష్క ఆ ఇమేజ్ తో దూసుకుపోతోంది. అరుంధతి సినిమాతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న బొమ్మాలి, తాజాగా రుద్రమదేవితో మరోసారి తన యాక్టింగ్ స్కిల్స్ ను బయటపెట్టడానికి రెడీ అవుతోంది. అయితే అనుష్క నటించిన తాజా సినిమాతో శ్రీదేవి లేటెస్ట్ మూవీకి పోలిక పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక విషయంలో ఇద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా రియాక్ట్ అయ్యారు.              […]

Advertisement
Update: 2015-06-27 20:00 GMT
ఒకప్పుడు అతిలోకసుందరి శ్రీదేవి నటనకు పెట్టింది పేరైతే.. ఇప్పుడు అనుష్క ఆ ఇమేజ్ తో దూసుకుపోతోంది. అరుంధతి సినిమాతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న బొమ్మాలి, తాజాగా రుద్రమదేవితో మరోసారి తన యాక్టింగ్ స్కిల్స్ ను బయటపెట్టడానికి రెడీ అవుతోంది. అయితే అనుష్క నటించిన తాజా సినిమాతో శ్రీదేవి లేటెస్ట్ మూవీకి పోలిక పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక విషయంలో ఇద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా రియాక్ట్ అయ్యారు.
రుద్రమదేవి సినిమా కోసం ఒరిజినల్ బంగారు ఆభరణాలు వాడారు. నేచురల్ లుక్ కోసం నకిలీ బంగారాన్ని కాకుండా.. నిజంగానే బంగారు ఆభరణాల్ని తెప్పించి రుద్రమదేవి షూటింగ్ లో వాడారు. ఇప్పుడు శ్రీదేవి విషయంలో కూడా అదే జరిగింది. ఓ తమిళ సినిమాలో శ్రీదేవి మహారాణిలా నటించింది. అందులో కూడా శ్రీదేవి కోసం ఒరిజినల్ బంగారు నగల్నే వాడారు. దాదాపు 10కిలోల బంగారు ఆభరణాల్ని శ్రీదేవి కోసం ఉపయోగించారట. గమ్మత్తేంటంటే.. రుద్రమదేవి కోసం అనుష్కకు.. తమిళ సినిమా కోసం శ్రీదేవికి వాడిన బంగారు ఆభరణాలు చెన్నై నుంచి తెప్పించినవే కావడం విశేషం.
Tags:    
Advertisement

Similar News