తమిళ దృశ్యం రెడీ చేసిన కమల్ హాసన్

లోకనాయకుడు కమల్ హాసన్ అప్పుడే మరో సినిమా విడుదల చేశాడు. ఉత్తమ విలన్ పూర్తయిన వెంటనే పాపనాశం అనే ప్రాజెక్ట్ ను తెరకెక్కించాడు కమల్. మలయాళంలో పెద్ద హిట్టయిన దృశ్యం సినిమాకు రీమేక్ ఇది. తెలుగులో కూడా వెంకటేష్ ఈ సినిమాను అదే పేరుతో రీమేక్ చేశాడు. ఇక్కడ కూడా అది పెద్ద హిట్టయింది. ఇప్పుడు తమిళ్ లో కమల్ నటనాకౌశలంతో పాపనాశం పేరుతో విడుదలకు సిద్ధమైంది. జీతూ జోసెఫ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో మీనా […]

Advertisement
Update: 2015-06-23 00:39 GMT
లోకనాయకుడు కమల్ హాసన్ అప్పుడే మరో సినిమా విడుదల చేశాడు. ఉత్తమ విలన్ పూర్తయిన వెంటనే పాపనాశం అనే ప్రాజెక్ట్ ను తెరకెక్కించాడు కమల్. మలయాళంలో పెద్ద హిట్టయిన దృశ్యం సినిమాకు రీమేక్ ఇది. తెలుగులో కూడా వెంకటేష్ ఈ సినిమాను అదే పేరుతో రీమేక్ చేశాడు. ఇక్కడ కూడా అది పెద్ద హిట్టయింది. ఇప్పుడు తమిళ్ లో కమల్ నటనాకౌశలంతో పాపనాశం పేరుతో విడుదలకు సిద్ధమైంది. జీతూ జోసెఫ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో మీనా పాత్రను గౌతమి పోషించారు. తాజాగా ఈ సినిమా పాటల్ని కూడా విడుదల చేశారు. వచ్చే నెల మొదటివారంలో పాపనాశం సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ప్రస్తుతం చేస్తున్న చీకటి రాజ్యం షూటింగ్ ను కూడా కొన్నిరోజులు వాయిదావేశారు. మరోవైపు హిందీలో కూడా దృశ్యం పేరుతో ఈ సినిమా రీమేక్ అవుతోంది. బాలీవుడ్ లో ఈ రీమేక్ లో అజయ్ దేవగన్-శ్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. హిందీ వెర్షన్ కూడా త్వరలోనే విడుదలకానుంది.
Tags:    
Advertisement

Similar News