త్వరలో సౌరశక్తితో నడిచే రైళ్లు

త్వ‌ర‌లో సౌరశక్తిని ఉపయోగించి రైళ్ళ‌ను న‌డ‌పాల‌ని భార‌తీయ రైల్వేలు యోచిస్తోంది. ఈ విష‌యాన్ని ఢిల్లీ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ అరుణ్‌ అరోరా ప్రకటించారు. ఫైలెట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే ఓ నాన్‌ ఏసీ కోచ్‌పై సౌర ఫలకాలను అమర్చి విజయవంతంగా నడిపి చూశామని చెప్పారు. దీంతో 17 యూనిట్ల విద్యుత్‌ ఆదా అయ్యిందని వెల్లడించారు. త్వరలో ఏసీ, నాన్‌ ఏసీ ఇలా అన్ని రైళ్ల పైభాగంలో సొలార్‌ ఫలకాలను అమర్చి విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఇంజన్‌ […]

Advertisement
Update: 2015-06-03 22:48 GMT
త్వ‌ర‌లో సౌరశక్తిని ఉపయోగించి రైళ్ళ‌ను న‌డ‌పాల‌ని భార‌తీయ రైల్వేలు యోచిస్తోంది. ఈ విష‌యాన్ని ఢిల్లీ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ అరుణ్‌ అరోరా ప్రకటించారు. ఫైలెట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే ఓ నాన్‌ ఏసీ కోచ్‌పై సౌర ఫలకాలను అమర్చి విజయవంతంగా నడిపి చూశామని చెప్పారు. దీంతో 17 యూనిట్ల విద్యుత్‌ ఆదా అయ్యిందని వెల్లడించారు. త్వరలో ఏసీ, నాన్‌ ఏసీ ఇలా అన్ని రైళ్ల పైభాగంలో సొలార్‌ ఫలకాలను అమర్చి విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఇంజన్‌ ఒక్క దానికి మాత్రం డీజిల్‌నే వినియోగిస్తామని తెలిపారు. ఒక్కో రైలుకు ఏడాదికి 90 వేల లీటర్ల డీజిల్‌ అవసరం అవుతోందని ఆయన వివరించారు. ఒక రైలు నుంచి ఏడాదికి 200 టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారం అవుతోందని దీంతో.. వాతావరణం కాలుష్యం కూడా పెరిగిపోతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైళ్లను సౌరశక్తితో నడిచేలా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వివరించారు. రైలు పెట్టె పైభాగంలో 40 చదరపు మీటర్ల స్థలం ఉంటుందని, అవసరాన్ని బట్టి దీనిపై సౌరఫలకాలను అమర్చి రైళ్ళ‌ను న‌డ‌పాల‌ని యోచిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.
Advertisement

Similar News