మరో 2 రోజులు ఏపీకి ఎండతీవ్రత

రెండు తెలుగు రాష్ర్టాల్లో మరో రెండు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. సోమవారం ఉత్తరాంధ్రలో ఉష్ణ్ఠోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. వడగాల్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మామూలుగా చ‌ల్ల‌గా ఉండే ఉత్త‌ర కోస్తాలో సైతం అత్యధిక ఉష్ణోగ్రతలు న‌మోద‌య్యాయి. మొత్తం మీద ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈరెండు రోజుల్లో 50 నుంచి 45 డిగ్రీల […]

Advertisement
Update: 2015-05-25 02:38 GMT
రెండు తెలుగు రాష్ర్టాల్లో మరో రెండు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. సోమవారం ఉత్తరాంధ్రలో ఉష్ణ్ఠోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. వడగాల్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మామూలుగా చ‌ల్ల‌గా ఉండే ఉత్త‌ర కోస్తాలో సైతం అత్యధిక ఉష్ణోగ్రతలు న‌మోద‌య్యాయి. మొత్తం మీద ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈరెండు రోజుల్లో 50 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. అయితే తెలంగాణ‌లో మాత్రం ఇక నెమ్మ‌దిగా ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. 45 డిగ్రీల లోపే న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. భానుడి ప్రతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలో తిరగవద్దని అధికారులు హెచ్చరించారు. అయితే తెల్ల‌వారు జాము నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 15 మంది, తెలంగాణ‌లో 13 మంది చ‌నిపోయిన‌ట్టు చెబుతున్నారు.
వడదెబ్బకు 31 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వడదెబ్బతో సోమవారం 15 మంది మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశంలో 5, అనంతపురంలో 2, విశాఖలో 3, కర్నూల్‌లో 1, నెల్లూరులో ఇద్దరు వడదెబ్బ ప్రభావంతో మరణించారు. వడగాల్పులతో జనం అల్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బతో సోమవారం 16 మంది మరణించారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 8 మంది మరణించారు. నిజామాబాద్‌ జిల్లాలో ఇద్దరు, రంగారెడ్డ్లిలో 1, మెదక్‌లో 1, ఆదిలాబాద్‌లో 1, కరీంనగర్‌లో 1, వరంగల్‌లో 1, నల్గొండలో ఒకరు మరణించారు.
Advertisement

Similar News