రాజధాని భూసేకరణకు తాత్కాలిక బ్రేక్

రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ జీవోను రెండు వారాల పాటు నిలిపి వేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, రాజధాని భూసేకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రెండు వారాల వరకు భూసమీకరణ చేయ‌డానికే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అడిషనల్ అడ్వకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోర్టుకు తెలిపారు. ఏపీ రాజధాని భూసేకరణ ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని భూసేకరణకు ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు రెండు వారాల స్టే విధించగా, ప్రభుత్వం […]

Advertisement
Update: 2015-05-21 21:40 GMT
రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ జీవోను రెండు వారాల పాటు నిలిపి వేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, రాజధాని భూసేకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రెండు వారాల వరకు భూసమీకరణ చేయ‌డానికే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అడిషనల్ అడ్వకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోర్టుకు తెలిపారు. ఏపీ రాజధాని భూసేకరణ ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని భూసేకరణకు ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు రెండు వారాల స్టే విధించగా, ప్రభుత్వం రెండు వారాల తర్వాతే భూసేకరణకు నోటీసులిస్తుందని ప్రభుత్వ అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Tags:    
Advertisement

Similar News