48 క్రాఫ్ట్స్ గా మారనున్న తెలుగు సినిమా ?

గత 22 యేళ్ళుగా ఏనాడు సాగనంత  పోటాపోటీగా, రసవత్తరంగా “మా” ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మార్చి 31 మంగళవారంనాడు ప్రకటిస్తారు. ఈ సంద‌ర్బంగా ఇరువర్గాలు చేసుకున్న ఆరోపణలతో సామాన్య ప్రజానీకానికి కూడా సినిమా పరిశ్రమలో దాగి ఉన్న డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డింది. దీనితో 24 క్రాఫ్ట్స్ లోని కొందరు రెండు రాష్ట్రాలు విడిపోయినట్టే అసోషియేషన్ కూడా ఆంధ్ర, తెలంగాణ అని విడిపోతే లాభదాయకమని భావిస్తున్నారట.  అయితే ప్రతి అసోషియేషన్ కు మూలనిధి ఉంది. ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా అసోషియేషన్ […]

Advertisement
Update: 2015-03-30 03:00 GMT

గత 22 యేళ్ళుగా ఏనాడు సాగనంత పోటాపోటీగా, రసవత్తరంగా “మా” ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మార్చి 31 మంగళవారంనాడు ప్రకటిస్తారు. ఈ సంద‌ర్బంగా ఇరువర్గాలు చేసుకున్న ఆరోపణలతో సామాన్య ప్రజానీకానికి కూడా సినిమా పరిశ్రమలో దాగి ఉన్న డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డింది. దీనితో 24 క్రాఫ్ట్స్ లోని కొందరు రెండు రాష్ట్రాలు విడిపోయినట్టే అసోషియేషన్ కూడా ఆంధ్ర, తెలంగాణ అని విడిపోతే లాభదాయకమని భావిస్తున్నారట. అయితే ప్రతి అసోషియేషన్ కు మూలనిధి ఉంది. ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా అసోషియేషన్ ఏర్పడితే నిధులు కూడా రెండుగా పంచాల్సి ఉంటుంది. ఇది ఇష్టం లేని మరికొందరు తెలుగు సినిమా అంటే అందరు ఒక్కటేనని చెబుతున్నారు. భ‌విష్య‌త్ ఏమిటో భ‌గ‌వంతుడికే తెలియాలి…!

Tags:    
Advertisement

Similar News