ఆస్ట్రేలియాపై భారత్‌ లక్ష్యం 329

అస్ట్రేలియా రాజధాని సిడ్నీలో జరుగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అస్ట్రేలియా భారత్‌ ఫీల్డర్లను ముప్పుతిప్పలు పెడుతూ భారీ స్కోరు చేసి భారత్‌కు 329 రన్‌ల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. తొలి వికెట్‌ 15 రన్‌లకే పడిపోయినప్పటికీ ఆ తర్వాత రెండో వికెట్‌ తీయడం భారత్‌కు కష్ట సాధ్యమైంది. 197 పరుగుల వరకు రెండో వికెట్‌ను భారత్‌ బౌలర్లు తీయలేకపోయారు. అలాగే మూడో వికెట్‌ పడేసరికి అస్ట్రేలియా 232 […]

Advertisement
Update: 2015-03-26 02:11 GMT

అస్ట్రేలియా రాజధాని సిడ్నీలో జరుగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అస్ట్రేలియా భారత్‌ ఫీల్డర్లను ముప్పుతిప్పలు పెడుతూ భారీ స్కోరు చేసి భారత్‌కు 329 రన్‌ల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. తొలి వికెట్‌ 15 రన్‌లకే పడిపోయినప్పటికీ ఆ తర్వాత రెండో వికెట్‌ తీయడం భారత్‌కు కష్ట సాధ్యమైంది. 197 పరుగుల వరకు రెండో వికెట్‌ను భారత్‌ బౌలర్లు తీయలేకపోయారు. అలాగే మూడో వికెట్‌ పడేసరికి అస్ట్రేలియా 232 పరుగులు చేసింది. మరో పరుగు దగ్గర అంటే 233 వద్ద నాలుగో వికెట్‌, 248 దగ్గర ఐదో వికెట్‌, 284 వద్ద ఆరో వికెట్‌, 298 దగ్గర ఏడో వికెట్‌ పడిపోయాయి. అయితే వికెట్‌లు ఇంకా చేతిలో ఉండడంతో చివరి ఓవర్లలో ఆస్ట్రేలియా దూకుడుగా 328 పరుగులు చేసి భారత్‌కు భారీ లక్ష్యాన్ని ముందుంచింది. స్టీవ్‌ స్మిత్‌ 93 బంతుల్లో 105 పరుగులు చేసి ఈరోజు ఆటలో అత్యధిక స్కోర్‌ చేసిన బ్యాట్స్‌మెన్‌గా మిగిలాడు. ఆ తర్వాత స్థానంలో 116 బంతుల్లో 81 పరుగులు చేసిన ఫించ్‌ది. భారత్‌ బౌలర్లు చక్కటి ప్రతిభ కనబరిచారు. యాదవ్‌ నాలుగు వికెట్‌లను, మోహిత్‌ శర్మ మూడు వికెట్‌లను, అశ్విన్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఓటమి అంటే తెలియకుండా ఆడిన భారత్‌కు ఇది చావుబతుకుల సమస్య. అందుచేత తన సర్వశక్తులు ఒడ్డి పోరాడి గెలిస్తేనే ఇప్పటివరకు ఆడిన ఆటకు ఫలితం ఉంటుంది. ఫైనల్లో న్యూజీలాండ్‌తో తలపడుతుంది. లేకపోతే ఇంటి దారి పట్టక తప్పదు. ప్రపంచ కప్‌ ఫైనల్లో భారత్‌ ఉండాలని కోరుకుందాం… సే… విష్‌ యు ఆల్‌ ది బెస్ట్‌!

Tags:    
Advertisement

Similar News