Telugu Global
Telangana

తెలంగాణలో న్యూస్ ట్యాప్ లేటెస్ట్ సర్వే..

గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల సీఎం కేసీఆర్ విజయం సాధిస్తారని ఈ సర్వే చెబుతోంది. ఇక కొడంగల్ లో రేవంత్ రెడ్డిదే విజయం అని స్పష్టం చేసింది. హుజూరాబాద్ లో ఈటల గెలుస్తాడని తెలిపింది. కాంగ్రెస్ కి ఖమ్మంలో గరిష్టంగా స్థానాలు వస్తాయని ఈ సర్వే చెబుతోంది.

తెలంగాణలో న్యూస్ ట్యాప్ లేటెస్ట్ సర్వే..
X

ఎన్నికల వేళ దాదాపుగా అన్ని సర్వేలు బీఆర్ఎస్ కే పట్టం కట్టాయి. మెజార్టీ విషయంలో కాస్త ఎక్కువ, తక్కువ ఉన్నా.. సొంతగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్ గ్యారెంటీ అని తేల్చేశాయి. తాజాగా న్యూస్ ట్యాప్ సంస్థ చేపట్టిన సర్వేలో కూడా ఇదే విషయం స్పష్టమైంది. సరిగ్గా ఎన్నికలకు 8రోజుల ముందు విడుదలైన ఈ సర్వే ప్రస్తుత ఓటరు అంతరంగాన్ని ప్రతిబింబించేలా ఉంది. బీఆర్ఎస్ కి ఈ సర్వేలో 65నుంచి 76 స్థానాలు రాబోతున్నాయి. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ కి 32 నుంచి 41 మధ్య సీట్లు వస్తాయని సర్వే సారాంశం. ఎంఐఎం కి 5నుంచి 7 స్థానాలు, బీజేపీకి 3 నుంచి 4 స్థానాలు, సీపీఐ, బీఎస్పీ చెరొకచోట గెలిచేందుకు అవకాశం ఉందని సర్వే చెబుతోంది.


సర్వే ఇలా జరిగింది..

మొత్తం లక్షా 19వేల మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. ఈనెల 16నుంచి 21 మధ్య ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. నియోజకవర్గాల వారీగా ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేశారు. 11 స్థానాల్లో మాత్రం రిజల్ట్ ప్రకటించలేదు. అక్కడ గట్టి పోటీ ఉంటుందని మాత్రం సర్వే సంస్థ ప్రకటించింది.



గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల సీఎం కేసీఆర్ విజయం సాధిస్తారని ఈ సర్వే చెబుతోంది. ఇక కొడంగల్ లో రేవంత్ రెడ్డిదే విజయం అని స్పష్టం చేసింది. హుజూరాబాద్ లో ఈటల గెలుస్తాడని తెలిపింది. కాంగ్రెస్ కి ఖమ్మంలో గరిష్టంగా స్థానాలు వస్తాయని ఈ సర్వే చెబుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానల్లో 6 కాంగ్రెస్ కి, 3 బీఆర్ఎస్ కి వస్తాయని, ఖమ్మం టౌన్ లో పోరు హోరాహోరీగా సాగుతుందని తెలిపింది.

మొత్తం సర్వే ఫలితాలు ఇక్కడ చూడండి..



First Published:  22 Nov 2023 2:58 PM GMT
Next Story