సెలెనియం తీసుకుంటున్నారా?

ముఖ్యమైన మినరల్
శరీరానికి కావల్సిన ముఖ్యమైన మినరల్స్‌లో సెలెనియం కూడా ఒకటి. దీన్ని రోజుకి 50 నుంచి 100 మైక్రోగ్రాములు తీసుకోవాలి. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో, ఇమ్యూనిటీ పెంచడంలో, కణాల వాపును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది ఏయే ఫుడ్స్‌లో లభిస్తుందంటే..
సన్‌ఫ్లవర్ సీడ్స్
పొద్దుతిరుగుడు పువ్వు గింజల్లో కావల్సినంత సెలెనియం ఉంటుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్‌ను పెరుగు లేదా పండ్లతో కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. ఇందులో సెలెనియంతో పాటు విటమిన్–ఇ, మెగ్నీషియం కూడా ఉంటాయి.
గుడ్లు
గుడ్లలో సెలెనియం కంటెంట్ ఉంటుంది. తెలుపు, పచ్చ సొనల్లో ఏది తీసుకున్నా సెలినియం లభిస్తుంది. గుడ్లు తినడం వల్ల మినరల్స్‌తో పాటు హెల్దీ ప్రొటీన్స్, విటమిన్స్ కూడా లభిస్తాయి.
మష్రూమ్స్
సెలినియం పొందడానికి పుట్టగొడుగులు మంచి ఆప్షన్. మష్రూమ్స్‌లో సెలెనియంతో పాటు ప్రొటీన్స్, క్యాల్షియం, విటమిన్–బి6 వంటివి కూడా పుష్కలంగా లభిస్తాయి.
బ్రెజిల్ నట్స్
బ్రెజిల్ నట్స్ అనబడే గింజల్లో సెలెనియం ఎక్కువ పాళ్లలో ఉంటుంది. ఇది అరుదుగా దొరికే నట్. ఇందులో మినరల్స్, విటమిన్స్‌తో పాటు ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి.
చేపలు
ట్యూనా, సాల్మన్ వంటి కొన్ని రకాల చేపల్లో కూడా సెలెనియం ఉంటుంది. చేపలు తీసుకోవడం వల్ల ఓవరాల్ ఇమ్యూనిటీ పెరగడంతోపాటు మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ముడి ధాన్యాలు
బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా, బార్లీ వంటి ధాన్యాల్లో సెలీనియం కంటెంట్ ఉంటుంది. డైట్‌లో వీటిని చేర్చుకుంటే సెలెనియం కోసం ఇతర పదార్థాలపై ఆధారపడాల్సిన పని లేదు.