సమ్మర్‌లో వేడి చేయకుండా ఉండాలంటే

బాడీ టెంపరేచర్
సమ్మర్‌లో వాతావరణం పెరుగుదల కారణంలో శరీరంలో కూడా వేడి పెరుగుతుంది. అయితే ఈ సీజన్‌లో కొన్ని ఫుడ్స్‌ను తీసుకోవడం ద్వారా బాడీ హీట్‌ను తగ్గించుకోవచ్చు. అవేంటంటే..
నీళ్లు
సమ్మర్‌లో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ముందుగా తీసుకోవాల్సింది నీటినే. రోజుకు నాలుగైదు లీటర్ల నీటిని మర్చిపోకుండా తీసుకుంటూ ఉండడం ద్వారా శరీరంలో వేడి పెరగకుండా చూసుకోవచ్చు.
కొబ్బరి నీళ్లు
సమ్మర్‌‌లో వేడి చేసినప్పుడు ఇన్‌స్టంట్ రిలీఫ్ పొందడం కొసం కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. అలాగే పుచ్చకాయ, ఖర్భూజా వంటి పండ్ల కూడా శరీరంలోని వేడిని తగ్గిస్తాయి.
మజ్జిగ
సమ్మర్‌‌లో ప్రతి రోజూ మజ్జిగ తీసుకోవడం ద్వారా వేడి చేయకుండా చూసుకోవచ్చు. మజ్జిగలో పుదీనా, సబ్జా గింజలను కలుపుకుంటే ఇంకా మంచిది.
కీరదోస
సమ్మర్‌‌లో శరీరాన్ని చల్లగా ఉంచే ఫుడ్స్‌లో కీరదోస ఒకటి. కీరదోస తినడం ద్వారా హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు. అలాగే కళ్లు మండుతున్నప్పుడు కీరా ముక్కలతో రిలాక్స్ అవ్వొచ్చు.
ఉల్లిపాయలు
ఉల్లిపాయలు శరీరంలోని వేడిని పోగొడతాయి. అందుకే సమ్మర్‌‌లో కూరల్లో లేదా పెరుగులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం మర్చిపోవద్దు.
జాగ్రత్తలు ముఖ్యం
సమ్మర్‌‌లో నూనె పదార్థాలు, కాఫీ, టీ, మసాలా ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మరింత త్వరగా వేడి చేస్తుంది. కాబట్టి వేసవిలో వీటికి దూరంగా ఉండడం మంచిది.